Samsung : దేశంలో దిగ్గజ టెలికాం సంస్థలలో ఒకటైన శాంసంగ్ తాజాగా ఒక కాంపిటీషన్ ను నిర్వహిస్తోంది. కోటి రూపాయల బహుమతిని అందించడానికి సిద్ధమయింది సాంసంగ్ ఇండియా . ఇక ఆసక్తి ఉన్నవారు జూలై 31వ తేదీ లోపల అప్లై చేసుకోవాల్సిందిగా వెల్లడించింది. అంతేకాదు ఈ కాంపిటీషన్ కి సంబంధించిన పూర్తి వివరాలను కూడా ఇవ్వడం జరిగింది. ఇకపోతే సామ్సంగ్ ఇండియా కొత్తగా యువతీ యువకులకు అద్భుతమైన అవకాశాన్ని కలిగించడానికి ముందుకు వచ్చింది. ఇకపోతే ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి వాటికి పరిష్కారం చెబితే మీకు కోటి రూపాయలు వరకు బహుమతి లభిస్తుంది. అంతే కాదండోయ్ ఐఐటి ఢిల్లీ మెంటార్ షిప్ కూడా మీరు పొందవచ్చు.
ముఖ్యంగా యువతను కేంద్రీకృతంగా తీసుకొని సాల్వ్ ఫర్ టుమారో అని కాన్సెప్ట్ మీద విద్యా ఆవిష్కరణల పోటీలు ప్రారంభించింది సాంసంగ్. ఇక ఈ కాంపిటీషన్లో 16 సంవత్సరాల వయసు నుంచి 22 సంవత్సరాల మధ్య ఉన్న యువతీ యువకులు ఎవరైనా సరే పాల్గొనవచ్చు. ముఖ్యంగా సమాజంలోని ప్రజలు జీవితాలను మార్చగల వినూత్న ఆలోచనలతో ముందుకు రావాలని కోరుతోంది. ఇకపోతే భారతదేశం యొక్క ఐక్యరాజ్యసమితి సూచించిన సుస్థిర అభివృద్ధి లక్ష్యాలకు అనుగుణంగా పర్యావరణం, విద్య, ఆరోగ్య సంరక్షణ , వ్యవసాయం లాంటి రంగాలలో సమస్యలకు పరిష్కారాలు సూచించాల్సి ఉంటుంది. ఇక దేశవ్యాప్తంగా జరుగుతున్న ఈ కాంపిటీషన్లో ప్రోగ్రాం ముగిసిన తర్వాత ముగ్గురు జాతీయ విజేతలను ప్రకటించి ఆ తర్వాత వారికి కోటి రూపాయలను బహుమతిగా లభిస్తుంది. దీంతో పాటు తమ ఐడియాలను నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లడానికి ఐఐటి ఢిల్లీకి చెందిన నిపుణుల మార్గదర్శకత్వం ఆరు నెలల పాటు లభిస్తుంది.
ఇకపోతే ఐఐటీ ఢిల్లీలోని ఇంక్యుబేషన్ సెంటర్ కి యాక్సిస్ కూడా పొందుతారు ఇక ఈ ఆరు నెలల్లో వారు తమ ఐడియాలపై పనిచేయడం జరుగుతుంది. ఇక ప్రోటో టైపు ను వినియోగదారుల స్థాయికి తీసుకెళ్లడానికి ప్రయత్నం చేస్తారు. అంతేకాదు గెలుపొందిన వారి స్కూలు, కాలేజీలకు 85 అంగుళాల సాంసంగ్ ఫ్లిప్ ఇంటరాక్ట్ డిజిటల్ బోర్డును కూడా ఉచితంగా అందివ్వనుంది సాంసంగ్. అంతేకాకుండా ఐఐటి ఢిల్లీలో బూట్ క్యాంపు, పార్టిసిపేషన్ సర్టిఫికెట్ , డిజైన్ థింకింగ్, స్టెమ్, ఇన్నోవేషన్ , లీడర్షిప్ వంటి ఆన్లైన్ కోర్సుల కోసం సుమారుగా లక్ష రూపాయల విలువైన ఓచర్లను కూడా ఉచితంగా అందిస్తారు. ఇక టాప్ టెన్ టీమ్స్ కి సామ్సంగ్ ఇండియా కార్యాలయాలు, ఆర్ఎండి కేంద్రాలు, బెంగళూరులోని సాంసంగ్, ఒపేరా హౌస్ లోను సందర్శించే అవకాశం కూడా లభిస్తుంది. ఆసక్తి ఉన్న యువతి యువకులు samsung.com వెబ్సైట్లో అప్లై చేసుకోవచ్చు.