Mobile : మీ మొబైల్ వాటర్ లో పడిందా? అలా మాత్రం చేయకండి..?

Mobile : ప్రస్తుత కాలంలో అత్యధిక టెక్నాలజీ ఉపయోగిస్తున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరికి స్మార్ట్ ఫోన్ అనేది నిత్యవసరంగా మారిపోయింది. ఇక ఎవరైనా సరే అన్నం లేకపోయినా ఒక పూట ఉంటారేమో కానీ చేతిలో స్మార్ట్ ఫోన్ లేకపోతే క్షణం కూడా గడవదు అంటూ తమ అభిప్రాయాలను వ్యక్తపరుస్తున్నారు. స్మార్ట్ ఫోన్ అనేది కేవలం ఎంటర్టైన్మెంట్ కోసం మాత్రమే కాకుండా ఉన్నత విద్యకు.. ఉద్యోగానికి ప్రపంచం నలుమూలలా జరిగే అన్ని విషయాలను తెలుసుకోవడానికి ఈ స్మార్ట్ ఫోన్ అనేది చాలా స్మార్ట్ గా పనిచేస్తుంది. మరి ఇప్పుడు అసలే వర్షాకాలం ఎక్కడ చూసినా వంకలు వాగులై పారుతున్నాయి. మరి

ఇలాంటి క్రమంలోనే ఒకవేళ మీ ఫోన్ నీటిలో తడిస్తే ? ఏదైనా పనిమీద వాటర్ లో పడితే? పరిస్థితి ఏంటి? ఆలోచించడానికి కొంచెం భయంగా ఉన్నా.. వాటర్ లో తడిసిన స్మార్ట్ ఫోన్ పై తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా తెలుసుకోవడం చాలా తప్పనిసరి. ఇకపోతే ఎన్ని జాగ్రత్తలు తీసుకున్న సరే ఒక్కోసారి మొబైల్ చేతిలోంచి నీటిలో జారిపోయి.. తడిసిపోతూ ఉంటుంది లేదా వర్షపు నీటిలో తడుస్తుంది. ఒకవేళ మీరు షాప్ నుంచి తేరుకొని నీటిలోంచి ఆ మొబైల్ తీసినా.. అప్పటికే నీరు మొబైల్ లోపలికి వెళ్ళిపోతుంది. ఇక తర్వాత టచ్ ప్యాడ్ సరిగ్గా పని చేయకపోవడం, స్క్రీన్ రంగులు మారుతూ ఉండడం లాంటి సమస్యలు తలెత్తుతాయి. ఇకపోతే నీటిలో తడిసిన మొబైల్ ను మనం కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే తప్పకుండా మీ మొబైల్ ను కాపాడవచ్చు. మీరు ఒకవేళ మొబైలు నీటిలో పడిందంటే వెంటనే ఆన్ లో ఉన్న మొబైల్ ను స్విచ్ ఆఫ్ చేయాలి. కంగారుపడి ఎట్టి పరిస్థితుల్లో కూడా మొబైల్ ని ఆపరేట్ చేయవద్దు.

Easy Steps To Fix Water Damaged Mobile
Easy Steps To Fix Water Damaged Mobile

ఇక మొబైల్ ను నీటిలో నుంచి తీసాక ఎలా పట్టుకున్నారో అలాగే ఉంచాలి. అటు ఇటు ఊపకుండా జాగ్రత్త పడాలి. ముఖ్యంగా కొంచెం వేడి తగిలిస్తే ఫోన్లో నీ నీటి ఆవిరవుతుంది అని అలాంటి ప్రయత్నాలు చేయకూడదు ఎండలో కూడా పెట్టకూడదు. ఇకపోతే నీటిలో నుంచి తీసిన తర్వాత పొడి గుడ్డతో ఫోను తుడవాలి. ఆ తర్వాత సిమ్ మెమొరీ కార్డులను తీసివేయాలి. ఇప్పుడు అన్నింటినీ కూడా టిష్యూ పేపర్ తో శుభ్రం చేయాలి. ఇప్పుడు ఒక కవర్లో బియ్యం తీసుకుని అందులో ఫోన్, బ్యాటరీ ఉంచి పూర్తిగా బియ్యంతో కప్పేసి.. గాలి చొరబడకుండా కవర్ను క్లోజ్ చేయాలి. ఇక ఆ బియ్యానికి నీటిని పీల్చే శక్తి ఉంటుందని టెక్నికల్ నిపుణులు కూడా చెబుతున్నారు. కాబట్టి ఒక రోజంతా అలా ఉంచి మరొకసారి తుడిచి బ్యాటరీ వేస్తే మొబైల్ ఎప్పటిలాగే పనిచేస్తుంది. ఇటీవల వస్తున్న చాలా మొబైల్స్ కూడా ఇలాంటి ప్రాసెస్ చేస్తే అవి పని చేస్తూ ఉండడం గమనార్హం.