తెలుగు చిత్ర పరిశ్రమలో నందమూరి ఫ్యామిలీది ఒక అధ్యాయం. ఈ కుటుంబం నుండి మొదట వచ్చిన స్వర్గీయ నందమూరి తారక రామారావు ఎటువంటి క్రేజ్ సంపాదించుకున్నారో మనందరికీ తెలిసిందే. తెలుగునాట ఆయన ఒక చెరగని స్థానాన్ని ఏర్పరచుకున్నారు. ఆయన తరువాత వారసుడుగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన బాలకృష్ణ ఇప్పుడు అగ్ర హీరోగా రాణిస్తున్నారు. దాంతో పాటు నందమూరి నట వారసుడిగా సినీ ఇండస్ట్రీకి పరిచయం అయిన జూనియర్ ఎన్టీఆర్ ఏకంగా గ్లోబల్ స్థాయిలో గుర్తించిన దక్కించుకొని స్టార్ హీరోల్లో ఒకరిగానే వెలుగొందుతున్నారు. ఈ ఫ్యామిలీలో అంత క్రేజ్ సంపాదించుకున్న జూనియర్ ఎన్టీఆర్ ని మొదటినుండి నందమూరి ఫామిలీ దూరం పెడుతుందనే రూమర్స్ బయట బాగా వినబడుతూ ఉంటాయి.
అయితే ఇందులో నిజానిజాలు దేవుడికెరుకగాని హరికృష్ణ పిల్లలైనటువంటి నందమూరి కళ్యాణ్ రామ్, జూనియర్ ఎన్టీఆర్ చాలా సఖ్యతగా కనబడుతూ వుంటారు. అంతేకాకుండా కళ్యాణ్ రామ్ జూనియర్ సినిమాలను నిర్మిస్తున్నాడు కూడా. పోనీ బాలయ్య వీరిని దూరం పెడుతున్నాడు అంటే అది అబద్ధమనే చెప్పుకోవాలి. చాలా ఫంక్షన్లలో వీరు కలిసిన వేదికలను మనం చూసాం. ఈ నేపథ్యంలోనే తాజా వీడియో ఒకటి ఎన్టీఆర్ మరియు బాలకృష్ణల అనుబంధానికి తార్కాణంలాగ నిలిచింది. అవును, మన బాలయ్య కొడుకు ఎన్టీఆర్ విషయంలో ఒకింత బాధపడుతున్నట్టు తెలుస్తోంది.
విషయం ఏమిటంటే…. ఏపీలో రాజకీయ వేడి ఏ స్థాయిలో ఉందనే విషయం అందరికీ తెలిసినదే. ఈ క్రమంలో చాలామంది జూనియర్ ఎన్టీఆర్ టీడీపీలోకి వస్తే బావుంటుందని అభిప్రాయ పడితే మరికొందరు అస్సలు ఎన్టీఆర్ ని టీడీపీ అంగీకరిస్తుందా? వాడుకొని వదిలేయడం తప్ప… అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. టీడీపీ ప్రత్యర్ధులు అయితే ఎన్టీఆర్ చంద్రబాబుకి ఎప్పుడో చెడింది… ఎన్టీఆర్ ఒకవేళ రాజకీయాల్లోకి వస్తే కొత్తగా పార్టీ పెట్టాల్సిందే అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ తరుణంలో బాలయ్య ఎన్టీఆర్ విషయమై వారి సన్నిహితుల మధ్య ఒకింత పడినట్టు తెలుస్తోంది. ఎంతో ప్రతిభ గల ఎన్టీఆర్ ని అనవసరంగా రాజకీయంలోకి లాగి లేనిపోని రాజకీయాలు చేయాలని చూస్తున్నారని వాపోయాడట బాలయ్య.
కాగా ఈ విషయం ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇకపోతే ఎవ్వరు ఏమనుకున్నా వారిది ఒకేటే ఫామిలీ, ఒకటే రక్తం అన్న సంగతి జనాలు మర్చిపోకుండా ఉంటే బెటర్. ఇక ఇంకోవిషయం కూడా ఇపుడు సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతోంది. నందమూరి అభిమానులు బాలయ్య, ఎన్టీఆర్ కాంబినేషన్లో సినిమా వస్తే చూడాలి అని ఎప్పటినుండో ఎదురుచూస్తున్న సంగతి విదితమే. అయితే దానికోసం డైరెక్టర్ వంశీ పైడిపల్లి ఒక కధ కూడా సిద్ధం చేసుకొని వారిని వినిపించాడని వినికిడి. అయితే ఆ కథను వారిరువురు రిజెక్ట్ చేశారని వినికిడి. ఇంకా దమ్మున్న కథను తీసుకురావాలని సూచించారట. ఇదిలా ఉంటే ఇక జూనియర్ ఎన్టీఆర్ సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం దేవర సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాడు జూనియర్ ఎన్టీఆర్.