Veera SimhaReddy: నందమూరి నరసింహ బాలకృష్ణ నటించిన వీర సింహారెడ్డి సినిమా నేడు థియేటర్స్ లో విడుదలై సందడి చేస్తోంది. మొదటి షో నుంచి ఈ సినిమా హిట్ టాక్ తో దూసుకెళ్తోంది.. ఈ సినిమా కమర్షియల్ ఎంటర్టైనర్ గా ఉంది. ఈ సినిమాలో బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేశారు.. ఈ సినిమా హిట్టా.. ఫట్టా.. ఒకసారి చూద్దాం..
కథ పాతదే అయినా కూడా బాలకృష్ణ తనకి బాగా కలిసి వచ్చిన ఫార్ములా తో ఈ సినిమా తీశారు. బాలకృష్ణకి వీరసింహారెడ్డి పాత్ర చాలా బాగా సరిపోయింది. ఆ పాత్రకి ఉన్న గాంబీర్యం బాలకృష్ణ చాలా సహజంగా తెరపై చూపించారు. శృతిహాసన్ గురించి పెద్దగా గుర్తిండిపోయే పాత్ర మాత్రం కాదు ఈ సినిమాకు హైలెట్ అయినా మరొక పాత్ర వరలక్ష్మి శరత్ కుమార్ ఇక విలన్ పాత్రలో నటించిన హనీరోజ్, దునియా విజయ్ కూడా అద్భుతంగా నటించారు. పాటలు చూడటానికి వినటానికి అద్భుతంగా ఉన్నాయి. తమన్ అందించిన బ్యాక్గ్రౌండ్ మాత్రం పర్ఫెక్ట్ అని చెప్పుకోవచ్చు .అయితే కామెడీ సీన్స్ మాత్రం అక్కడక్కడ ఇరికించినట్లు అనిపిస్తాయి. కొన్ని యాక్షన్ సీన్స్ ఎమోషనల్ సీన్స్ మాత్రం ప్రేక్షకుల్ని కట్టిపడేస్తాయి .వీరసింహారెడ్డి రైజేషన్ ప్రతి ఒక్కరికి నచ్చుతుంది .ఫస్ట్ అఫ్ కాస్త సాగదీసినట్లుగా అనిపిస్తుంది .సెకండ్ ఆఫ్ మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ సినిమాని కచ్చితంగా ఒకసారి చూడొచ్చు. ఈ సినిమా హిట్ టాక్ తో తీసుకెళ్తుంది.