Balakrishna: నందమూరి నరసింహ బాలకృష్ణ శృతిహాసన్ జంటగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రం వీర సింహారెడ్డి ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఊచ కోత కలెక్షన్లను వసూలు చేస్తుంది.. కలెక్షన్లతోపాటు రికార్డులను కూడా బద్దలు కొడుతున్నాడు బాలయ్య. టాలీవుడ్ లో టాప్ కలెక్షన్స్ సాధించిన సినిమాలలో తన సినిమాను కూడా నిలబెట్టేశాడు.. పుష్ప సినిమా రెండు రాష్ట్రాలలో కలిపి మొదటి రోజే 24.90 కోట్ల షేర్ ను వసూలు చేసింది. తాజాగా ఈ షేర్ ను నందమూరి బాలకృష్ణ నటించిన వీర సింహ రెడ్డి 25.36 కోట్ల షేర్లతో దాట్టేసింది.
మొదటి రోజు అత్యధిక షేర్ వసూలు చేసిన సినిమాల్లో 15వ స్థానంలో నిలిచింది. ఇక ఈ లిస్టులో 74.11 కోట్ల షేర్ తో రాజమౌళి తీసిన ఆర్ఆర్ఆర్ సినిమా ముందు స్థానంలో ఉంటే.. సెకండ్ ప్లేస్ లో కూడా రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి 2 ఉంది. ఇక వీర సింహారెడ్డి సినిమా రోజురోజుకీ కలెక్షన్ల భారంగా పరంగా తన సత్తా చాటుతున్నాడు బాలయ్య.. ఈ విషయం తెలుసుకున్న నందమూరి ఫ్యాన్స్ ఆనందంలో మునిగి తేలుతున్నారు.
ఈ సినిమాకు బాలయ్య కెరీర్ లోనే ఆల్ టైం హైయెస్ట్ ఓపెనింగ్స్ వచ్చాయి వీరసింహారెడ్డికి.. ఈ సినిమా మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ. 23.35 కోట్ల షేర్ రాబట్టింది. ప్రపంచ వ్యాప్తంగా తొలి రోజు రూ. 31.05 కోట్ల షేర్ (రూ. 50.10 కోట్ల గ్రాస్) కలెక్షన్స్ రాబట్టింది. ఇక రెండో రోజు రూ. 6.15 కోట్లు.,., రూ. 11.05 కోట్ల గ్రాస్ వసూలు చేయగా.. మూడో రోజు రూ. 7.30 కోట్లు.. (రూ. 12.75 కోట్లు గ్రాస్).. నాల్గో రోజు.. రూ. 8.15 కోట్లు.. (రూ. 14.20 కోట్ల గ్రాస్).. ఐదో రోజు రూ. 7.25 కోట్ల షేర్.. రూ. (రూ. 12.50 కోట్ల గ్రాస్) వసూళ్లను సాధించింది.
బాలయ్య ఏదో రోజు అదే మకర సంక్రాంతి రోజున కూడా మాత్రం తగ్గకుండా చక్కటి కలెక్షన్స్ వసూలు చేశాడు.. రెండు అంకెల గ్రాస్ తో దుమ్ము దులిపేసాడు.. చిరంజీవి వాల్తేరు వీరయ్య కంటే నందమూరి బాలకృష్ణ ఒక అడుగు ముందుంటున్నాడు కలెక్షన్స్ లో.. అది చూసి మెగా ఫ్యాన్స్ ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు.