Balakrishna – Chiranjeevi : బావ చిరంజీవి కి దిమ్మతిరిగే దెబ్బ కొడుతూ .. బాలయ్య తో అల్లూ అరవింద్ అతిపెద్ద ప్రాజెక్ట్ !

Balakrishna – Chiranjeevi :కొణిదల ప్రొడక్షన్ హౌస్ పెట్టినప్పటి నుంచి అల్లు వారికి మెగా ఫ్యామిలీకి మధ్య సంబంధాలు సరిగ్గా లేవని సోషల్ మీడియా కూడా వస్తుంది.. అంతెందుకు అన్ స్టాపబుల్ కి చిరంజీవికి ప్రధాన ప్రత్యర్థిగా ఉన్న బాలకృష్ణను అల్లు అరవింద్ అప్రోచ్ అప్పట్లో చర్చనీయాంశంగా మారింది. ఇదే విషయం మీద చిరంజీవి స్పందించారు కూడా. తమకు అల్లు అరవింద్ ఫ్యామిలీకి ఎలాంటి ఇబ్బందులు లేవని అందరం కలిసే ఉంటామని చెప్పుకొచ్చారు. తాజాగా మరోసారి ఈ విషయం హాట్ టాపిక్ అవుతుంది.. అల్లు అరవింద్ బాలకృష్ణతో ఒక సినిమా చేయడానికి సర్వం సిద్ధం చేసుకున్నట్లు ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది..

Allu Aravind movie with Balakrishna avoid chiranjeevi
Allu Aravind movie with Balakrishna avoid chiranjeeviకళ్యాణ్ రామ్ తో బింబిసార సూపర్ హిట్ అందించిన వశిష్ట దర్శకత్వంలో బాలకృష్ణతో గీత సంస్థ ఒక సినిమా చేయనున్నారని టాక్.. నిజానికి గీత ఆర్ట్స్ ప్రస్తుతానికి సినిమాలు చేయడం లేదు. ఒక బడా ప్రాజెక్టు కోసం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. చిన్న చిన్న సినిమాలు అన్నీ గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ మీదే చేస్తున్నారు. చాలా కాలం గ్యాప్ రావడంతో గీతా ఆర్ట్స్ బ్యానర్ లో కూడా ఒక సినిమా చేయాలని అనుకుంటున్నారు.

అలా సినిమా చేయాలని భావిస్తున్న అల్లు అరవింద్ కి బాలకృష్ణ తోనే చేయాలన్న ఆలోచన కలిగిందట. ప్రస్తుతం బాలకృష్ణ కెరీర్ లోనే ఫుల్ ఫామ్ లో ఉన్నారు. అయితే బాలయ్య కోరినంత రెమ్యునరేషన్ ఇచ్చి మరీ సినిమా చేసేందుకు అల్లు అరవింద్ ఫిక్స్ అయ్యారట. ఈ సినిమా బాలయ్య కెరీర్ లోనే అతిపెద్ద ప్రాజెక్ట్ అని.. ఇప్పటికే అల్లు అరవింద్ అందుకు రంగం సిద్ధం చేశారు అని జోరుగా ప్రచారం సాగుతోంది..

ఒకవేళ ఇదే నిజమైతే కనక మెగాస్టార్ చిరంజీవిని పక్కన పెట్టి తనకు అత్యంత ప్రత్యర్థి అయినా బాలకృష్ణతో అల్లు అరవింద్ సినిమా చేయడం అయితే అతి పెద్ద భారీ ప్రాజెక్టు చేస్తున్నారంటే ఇక ఈ న్యూస్ సోషల్ మీడియాలో ఎంత ట్రెండింగ్ అవుతుందో అర్థం చేసుకోవచ్చు..

నిప్పు లేనిదే పొగరాదన్నట్టు నిజంగా మేటర్ లేకుండా ఇంత పెద్ద విషయం బయటకు పక్కకు కచ్చితంగా ఈ మేటర్ లో ఎంతో కొంత వాస్తవం ఉంది అంటున్నారు మెగా నందమూరి ఫ్యాన్స్ . మొత్తానికి అల్లుఅర్జున్ బ్యానర్ పై నందమూరి బాలకృష్ణ భారీ ప్రాజెక్టు చేయనున్నారని సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది..