Balakrishna: ఏమీ అనకుండానే అక్కినేని వాళ్ళకంటే రెచ్చిపోతోన్న మెగా బ్యాచ్ కి మరొక ఝలక్ ఇచ్చిన బాలయ్య !

Balakrishna:నందమూరి బాలకృష్ణ తెలుగు సినీ దిగ్గజాలైన ఎస్వీ రంగారావు, అక్కినేని నాగేశ్వరరావు లను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై గత రెండు రోజులుగా పెద్ద దూమారం రేగుతున్న సంగతి తెలిసిందే.. బాలయ్య వీరసింహారెడ్డి విజయోత్సవం స్టేజ్ పై మాట్లాడుతూ.. ఆ.. రంగారావు.. ఈ రంగారావు.. అక్కినేని తోక్కినేని అంటూ.. చేసిన వ్యాఖ్యలు అక్కినేని ఫ్యామిలీ హీరోలకు వారి అభిమానులకు ఆగ్రహాన్ని తెప్పించాయి.. దీనిపై పలువురు భిన్న అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. అక్కినేని అభిమానులు బాలకృష్ణపై మండిపడుతున్నారు..

Advertisement
balakrishna strong counter for  chiranjeevi fans
balakrishna strong counter for chiranjeevi fans

బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలపై నాగచైతన్య అఖిల్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. తెలుగు కళమ్మ తల్లి ముద్దుబిడ్డలు నందమూరి తారక రామారావు గారు, అక్కినేని నాగేశ్వరరావు గారు, ఎస్వీ రంగారావు గారు.. వారిని మనం అగౌరవపరచడం మనల్ని మనమే కించపరుచుకోవడం అని అన్నారు.. ఈ విషయంపై తాజాగా ఆలిండియా అక్కినేని ఫ్యాన్స్ అసోసియేషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది.. వెంటనే బాలయ్య అక్కినేని కుటుంబానికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.

Advertisement

ఇదిలా ఉంటే బాలయ్య చేసిన వ్యాఖ్యలపై కాపు నాడు అల్టిమేట్ జారీ చేసినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. కాపు సామాజిక వర్గం కాపునాడు తీవ్రంగా పరిగణించిందని బాలయ్య చేసిన వ్యాఖ్యలు కాపుల మనోభావాల్ని దెబ్బతీసేవిలా ఉన్నాయని.. ఈ వ్యాఖ్యలపై ఈనెల 26 లోపు బాలకృష్ణ క్షమాపణలు చెప్పాలని.. అలా క్షమాపణలు చెప్పని పక్షంలో కాపులంతా శాంతియుతంగా రంగా విగ్రహం వద్ద మౌన ప్రదర్శన చేయాలని కాపునాడు పిలుపునిచ్చినట్లుగా చెబుతున్నారు . అయితే బాలయ్య వీళ్ళందరికీ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చే సమాధానం సిద్ధం చేసినట్లుగా ఆయన సన్నిహితుల దగ్గర నుంచి అందుతున్న సమాచారం..

సందు దొరికిందని మెగా ఫాన్స్ బాలయ్యను టార్గెట్ చేస్తున్నారు .. అక్కినేని తోక్కినేని వ్యాఖ్యలు చేసిన బాలయ్య పై మెగా ఫాన్స్ ఇన్ డైరెక్టుగా విరుచుకుపడుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న బాలయ్య ఫ్యాన్స్ ముందు మీ సంగతి చూసుకోండి అంటూ.. వాళ్లకే ఝలక్ ఇచ్చేలాగా బాలయ్య ఫ్యాన్స్ రివర్స్ అయ్యారని సోషల్ మీడియాలో ఓ న్యూస్ వైరల్ అవుతుంది.

Advertisement