Sharwanand: శర్వానంద్ పెళ్లి చేసుకోబోయే రక్షిత రెడ్డి కి ఎన్ని కోట్ల ఆస్తి ఉందొ తెలుసా .. కోట్లకి పడగలెత్తబోతోన్న శర్వానంద్ !

Sharwanand: టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ లో హీరో శర్వానంద్ కూడా ఒకరు.. ఇటీవ‌ల శర్వానంద్ బాలయ్య అన్ స్టాపబుల్ షోకి అతిథిగా హాజరైన సంగతి తెలిసిందే. ఈ షోలో బాలయ్య శర్వాని పెళ్ళెప్పుడు అని ప్రశ్నించగా.. ప్రభాస్ పెళ్లి తర్వాత అని సరదాగా బదులిచ్చాడు.. దాంతో శర్వానంద్ పెళ్లి టాపిక్ సోషల్ మీడియాలో వైరల్ అయింది కాగా శర్వానంద్ త్వరలోనే పెళ్లి పెట్టలేకపోతున్నాడని ఓ న్యూస్ వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే.. ఇక రేపోమాపో నిశ్చితార్థం కూడా జరగనుందని సమాచారం..

sharwanand marry rakshita reddy property value
sharwanand marry rakshita reddy property value

శర్వానంద్ పెళ్లి చేసుకోబోయే అమ్మాయి రక్షిత రెడ్డి. ఈమె అమెరికాలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్. తెలంగాణ హైకోర్టు న్యాయవాది మధుసూదన్ రెడ్డి కుమార్తె.. ర‌క్షిత చిత్తూరు జిల్లాకు చెందిన తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే దివంగత బొజ్జల గోపాలకృష్ణా రెడ్డి మనవరాలు. రక్షిత రెడ్డి తండ్రి మధుసూదన్ రెడ్డి సోదరుడు గంగారెడ్డి, బొజ్జల గోపాలకృష్ణారెడ్డి అల్లుడు. ఆ విధంగా వధువు.. గోపాలకృష్ణారెడ్డికి మనవరాలు అన్న మాట.

దీనిని బట్టి చూస్తే రక్షిత రెడ్డి వెనుక వేల కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి సమాచారం. తన తండ్రి కూడా పెట్టిన ఆస్తులతో పాటు తన తాతల తరం నుంచి వస్తున్న ఆస్తులు కూడా రక్షిత పేరు మీద ఉన్నాయట.. మొత్తంగా శర్వానంద్ వేలకోట్ల ఆస్తి ఉన్న రక్షిత మెడలో తాళికట్టనున్నాడు.. ఆ తరువాత ఆ ఆస్తులన్నీ శర్వానంద్వే అనుకోండి. జనవరి 26న వీరిద్దరి నిశ్చితార్థం జరుగనున్నట్లు వార్తలు వస్తున్నాయి. పెళ్లికి సంబంధించి పూర్తి వివ‌రాలు తెలియాల్సి ఉంది.