Parlament : పార్లమెంట్ సాక్షిగా రఘురామ కృష్ణం రాజు కి ఎంపీ భరత్ తో డైరెక్ట్ గా పడింది రచ్చ !

Parlament :లోక్ సభ వేదికగా వైసిపి రెబల్ ఎంపీ రఘురామ రాజు వర్సెస్ ఎంపీ భరత్ తో పాటు వైసిపి నేతల వార్ హాట్ హాట్ గా సాగింది. అసలు గొడవ ఎందుకు జరిగింది. రఘురామ తన ముఖానికి చేతిని ఎందుకు అడ్డుపెట్టుకొని మరి.. ఏ విషయాన్ని చెప్పవలసి వచ్చిందో ఇప్పుడు చూద్దాం.

 

ఆంధ్రప్రదేశ్లో అధికారిక వైసిపికి తలనొప్పిగా మారారు ఎంపీ రఘురామ కృష్ణంరాజు వేదిక ఏదైనా.. వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి విధానాలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నాడు. సొంత పార్టీ మీద అయి ఉండి విమర్శలు చేస్తుండడంతో వైసిపి పెద్దలకు తలనొప్పిగా మారింది. అలాంటిది పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని చూసినా అది జరగడం లేదు.. వైసిపి ఎంపీలు ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేసినా అవి సక్సెస్ కాలేకపోయయి.

దాంతో రఘురామా పేరు వింటేనే వైసీపీ పెద్దలకు టెన్షన్ మొదలవుతుంది . ఎప్పుడు ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారో తెలియక ఇబ్బంది పడుతున్నారు. తాజాగా లోక్సభలో అందరి ముందే వైసిపి ఎంపీలకు రెబల్ ఎంపీ రఘురామాకు మాటలు యుద్ధం జరిగింది. ఎంతలా అంటే ఆఖరికి వైసీపీ ఎంపీలపై కోపంతో ఆయన ముఖానికి చేతిని అడ్డుపెట్టుకొని మరీ చెప్పాల్సిన మాటలను స్పీకర్ కి వివరిస్తూ చెప్పారు.

ఏపీ ప్రభుత్వం చేస్తున్న భారీ అప్పుల పై ఇప్పటికే విమర్శలు చేస్తున్న రఘురామరాజు లోక్సభలో ను ఆ విషయాన్ని లేవనెత్తారు. దాంతో వైసిపి ఎంపీలు అడ్డుకున్నారు. ముఖ్యంగా రఘురామరాజు వర్సెస్ భరత్ మధ్య మాటల యుద్ధం జరిగింది. మీరు ఆ విషయాల గురించి పూర్తిగా తెలుసుకోకుండా మాట్లాడుతున్నారని అన్నారు. నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి. అసలు నన్ను మాట్లాడనివ్వండి అంటూ రఘురామరాజు తన చేతిని అడ్డం పెట్టుకొని మరీ తను మాట్లాడాలనుకున్నది మాట్లాడారు. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర ఖజానాకు రావలసిన ఆదాయాన్ని ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్కు మళ్ళించి.. ఆ మళ్లించిన ఆదాయాన్ని ఆ కార్పోరేషన్ ఆదాయంగా చూపిస్తూ.. ఆ కార్పొరేషన్ మీద అప్పులు చేస్తుందని పార్లమెంటులో రఘురామకృష్ణం రాజు తెలిపారు.