Samantha : సమంత గురించి ఇలాంటి న్యూస్ స్ప్రెడ్ చేస్తోంది ఎవరు ??

Samantha :Samantha: సినీ ఇండస్ట్రీలో ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండానే ఇండస్ట్రీలో అడుగు పెట్టి స్టార్ హీరోయిన్ గా ఎదిగింది సమంత.. ఏం మాయ చేసావే సినిమా నుంచి యశోద వరకు సినిమా వరకు ఆమె నటనకు వంక పెట్టే పనే లేదు.. కానీ ఇటీవల సమంత కెరీర్ లో అన్ని ఒడిదుడుకులే.. వాటి పై వేణు స్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు.. వాటిని కొంతమంది కావాలని సోషల్ మీడియాలో పనిగట్టుకుని వైరల్ చేస్తున్నారు.

సమంత అమావస్య రోజున పుట్టింది. పండితులు చెబుతున్న విషయాల ప్రకారం.. అమావాస్య రోజు పుట్టడం వల్ల జీవితంలో కష్టాలు పడాల్సి ఉంటుంది. అమావాస్య రోజున పుట్టిన వాళ్లకు ప్రేమ, ఆర్థిక విషయాలకు సంబంధించిన ఇబ్బందులు ఎదురవుతాయి. అమావాస్య రోజు పుట్టడం వల్ల ఆడపిల్లలకు కొన్ని లాభాలు ఉన్నా ఆ లాభాలతో కూల్చి చూస్తే నష్టాలు ఎక్కువగా ఉంటాయి..

Samantha telling on how was the facing problems on myositis
Samantha telling on how was the facing problems on myositis

అమావాస్య రోజు పుట్టిన వాళ్లకు నెగిటివ్ ఆలోచనలు ఎక్కువగా ఉండటంతో పాటు వీళ్ళు ఏదైనా అపశకునం కోరుకుంటే అది వెంటనే జరుగుతుందట. సమంత పుట్టినరోజే ఆమె పాలిట శాపం అయింది. నాగచైతన్య సమంత విడిపోవడానికి సమంతా అమావాస్య రోజు పుట్టడమే కారణమని వేణు స్వామి కూడా సమంత జాతకం గురించి సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.

అసలు వీరి పెళ్లి జరిగిన కొద్ది నెలలకే వీళ్ళు విడిపోతారని ఆయన చెప్పినప్పుడు ఎవరు నమ్మలేదు. తర్వాత అవే నిజం అవడంతో అందరూ ఆశ్చర్యపోయారు. సమంత అమావాస్య రోజున పుట్టడం వల్లనే ఇవన్నీ జరుగుతుంది అని వేణు స్వామి మరోసారి సంచలన కామెంట్స్ చేయడం తో మరోసారి ఈ వార్త వైరల్ అవుతుంది. కాగా ఈ వార్తను కొంతమంది కావాలని పని కట్టుకొని మరి వైరల్ చేస్తున్నారు.