Andhra Pradesh : ఏపీలో వాహనదారులకు అలర్ట్.. ట్రాఫిక్ ఉల్లంఘనలపై ప్రభుత్వం కొరడా ఝళిపిస్తోంది.. ఇంతకుముందులా వంద రూపాయలు చెల్లించి వెళ్ళిపోదాం అంటే కుదరదు.. ఇప్పటినుంచి లెక్కలు మారాయి.. ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేశారు జేబుకు భారీగా చిల్లు పడటం ఖాయం..!!ఆంధ్రప్రదేశ్ లో రూల్స్ బ్రేక్ చేసిన వాహనదారులకు చుక్కలు చూపిస్తున్నారు రవాణాశాఖ అధికారులు.
ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘిస్తే జేబుకు చిల్లు పడటం ఖాయం అంటున్నారు.. ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేస్తే జేబుకి భారీగా చిల్లు పెడుతున్నారు. హెల్మెట్ ధరించకుండా బైక్ తో రోడ్డు పైకి వస్తే మునుపటి లాగా వంద రూపాయలు చెల్లిస్తే సరిపోదు ఇప్పటి నుంచి వెయ్యి రూపాయలు కట్టాల్సిందే.. సిల్క్ బెల్ట్ పెట్టుకోకపోయినా వెయ్యి రూపాయలు ముక్కుపిండి వసూలు చేస్తున్నారు.లారీ గూడ్స్ ఆటోలో పరిమితికి మించి ఎక్కువ అ ఎత్తులు లోడు తీసుకు వెళుతుంటే మాత్రం రూ.20,000 చెల్లించాల్సిందే.

. గత కొన్ని రోజులుగా రవాణా శాఖ ఈ విధంగా జరిమానాలను విధిస్తూంటే వాహనదారులు గగ్గోలు పెడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం 2020 అక్టోబర్ 21న కొత్త జరిమానా అమలుపై ఉత్తర్వులు ఇచ్చింది. ఆ మేరకు కొత్త నిబంధనల ప్రకారం.. సాఫ్ట్ వేర్ లో నమోదు చేసిన విధంగా జరిమానా విధిస్తున్నట్లు ట్రాఫిక్ అధికారులు చెబుతున్నారు.