Good News : ప్రస్తుతం ఎక్కడ చూసినా నిరుద్యోగుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది.. చదివే వారు ఎక్కువవుతున్నారు … అలాగే ఉద్యోగాలు లేక నిరుద్యోగులుగా మారుతున్నారు. ఈ నేపద్యంలోని వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా నిరుద్యోగులకు సూచిస్తున్న విషయం తెలిసిందే.. ఇక అందుకే విద్యార్థులు ఉద్యోగం పొందాలి అంటే ఎందులో ఎక్కువగా లభిస్తాయి.. ఏది చదివితే త్వరగా ఉద్యోగం వస్తుంది అనే విషయాలను ముందుగా తెలుసుకొని చదువుకుంటున్నారు. రోజురోజుకు నిరుద్యోగ సమస్య ఎక్కువవుతున్న నేపద్యం లో తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు ఒక చక్కటి అవకాశాన్ని కలిగించింది.
ఇక ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి అని సూచిస్తూ దరఖాస్తులు కోరడం గమనార్హం. ఇకపోతే ఏ జిల్లాలో ఖాళీలు ఉన్నాయి.. ఏ విభాగంలో ఖాళీలు ఉన్నాయి అనే విషయాలను ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం..ఇదిలా ఉండగా తెలంగాణ ప్రభుత్వానికి చెందిన సంగారెడ్డి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి కార్యాలయంలో.. గ్రామీణ, పట్టణ ఆసుపత్రులలో ఖాళీగా ఉన్న మెడికల్ ఆఫీసర్ అలాగే సపోర్టింగ్ స్టాఫ్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరడం జరుగుతోంది.

మొత్తం ఖాళీల సంఖ్య..103
పోస్టుల వివరాలు:
1. మెడికల్ ఆఫీసర్: 100
2. సపోర్టింగ్ స్టాఫ్ : 3
అర్హతలు:
విద్యార్థులు పోస్ట్ లను బట్టి సంబంధిత విభాగంలో డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవంతో పాటు నోటిఫికేషన్ లో సూచించిన ఇతర అర్హతలు కూడా విద్యార్థులకు ఉండాలి.
దరఖాస్తు విధానం:
ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలి.
చిరునామా:
జిల్లా వైద్య మరియు ఆరోగ్య అధికారి.. సంగారెడ్డి.. తెలంగాణ.
దరఖాస్తులకు చివరి తేదీ : 2022 ఫిబ్రవరి 28
https://sangareddy.telangana.gov.in/ ఈ వెబ్సైట్ ద్వారా పూర్తి వివరాలను తెలుసుకొని ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.