Money Tips : ఈ షేర్ తో కాసుల వర్షం .. ఎలాగంటే..?

Money Tips : షేర్ మార్కెట్ లో డబ్బులు పెట్టేటప్పుడు ప్రతి ఒక్కరూ చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఎందుకంటే షేర్ మార్కెట్ లో డబ్బులు పెట్టడం అనేది హై రిస్కుతో కూడుకున్న పని అందుకే డబ్బులు పెట్టడానికి ముందు గానే ఇన్వెస్ట్మెంట్ నిపుణుల సలహాలు తీసుకోవడం చాలా అవసరం.. ఇక షేర్ మార్కెట్ లో ఇటీవల రూ. 10 వేల పెట్టుబడి పెట్టిన వారికి ఏకంగా కోట్లలో లాభం వచ్చింది.. ఇక చెప్పాలంటే ఇది అంత ఆషామాషీ విషయం కాదు అన్ని స్టాక్ మార్కెట్లో కూడా ఒక్కొక్కసారి ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి.. షేర్ మార్కెట్ లో డబ్బులు పెట్టడం వల్ల రిస్క్ తో పాటు భారీ మొత్తంలో లాభం కూడా ఉంటుంది.

ఇక అందుకే ఈక్విటీ మార్కెట్ లో డబ్బులు పెట్టాలని భావించేవాళ్లు చాలా జాగ్రత్తగా వ్యవహరించడం తప్పని సరి.. లేకపోతే డబ్బులను నష్టపోయే పరిస్థితులు కూడా వస్తాయి.. ఒక్కోసారి పెట్టిన పెట్టుబడులు కూడా తిరిగి రాకపోవచ్చు.. ఎవరైనా సరే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ మెంట్ చేసే ముందు ఇన్వెస్ట్మెంట్ నిపుణుల సలహా తీసుకోవడం చాలా ఉత్తమం. ప్రస్తుతం ఇన్ఫోసిస్ షేర్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి.. దిగ్గజ ఐటీ కంపెనీలలో ఇది కూడా ఒకటి అని చెప్పవచ్చు.. 1996 ఫిబ్రవరి 23వ తేదీన ఇన్ఫోసిస్ లో ఒక్కొక్క షేర్ ధర కేవలం 96 పైసలు మాత్రమే ఉండేది.

Cash rain with this share anyway
Cash rain with this share anyway

ఇకపోతే ప్రస్తుతం ఈ షేర్ ధర ఏకంగా రూ. 1742 స్థాయికి చేరింది అంటే కేవలం 26 సంవత్సరాల కాలంలో ఈ షేరు ధర ఏకంగా 181358 శాతం రాబడిని సొంతం చేయడం గమనార్హం.. లెక్కల ప్రకారం చూసుకుంటే మనం 26 సంవత్సరాల క్రిందట ఈ షేర్ లో రూ.10 వేలు పెట్టిన వారికి ప్రస్తుతం దీని ధర రూ.1.81 కోట్లు అన్నమాట. ఇప్పటికీ కూడా ఇన్ఫోసిస్ షేర్ అందుబాటులో ఉంది.. మీరు కూడా నిపుణుల సలహా మేరకు షేర్ తీసుకొని లాభాలను పొందవచ్చు.