రాయలసీమ ముద్దుబిడ్డతో ఘనంగా ప్రదీప్ మాచిరాజు వివాహం?

ప్రదీప్ మాచిరాజు గురించి తెలుగు కుర్రాళ్ళకి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తెలుగులో ఉన్న స్టార్ యాంకర్లలో ప్రదీప్ పేరు బాగా వినబడుతుంది. మొదట చిన్న చిన్న షోలతో కెరీర్ని మొదలుపెట్టిన ఇతగాడు ‘కొంచెం టచ్ లో ఉంటే చెబుతాను’, ‘సర్కార్’ వంటి హిట్ షోలతో బుల్లితెరపై తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని క్రియేట్ చేసుకున్నారు. అంతేకాకుండా సినిమా పరిశ్రమలో కూడా అడుగుపెట్టి అడపాదడపా తన ప్రతిభను చాటుతూనే వున్నారు. ఈ క్రమంలో “30 రోజుల్లో ప్రేమించడం ఎలా?” అనే సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ప్రదీప్ మాచిరాజుకి లేడి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా గట్టిగానే ఉంటుంది.

ఇకపోతే, ఎప్పటికప్పుడు పెళ్లి రూమర్స్ తో ప్రదీప్ వార్తల్లో నిలుస్తూనే ఉంటాడు. తన పెళ్లికి సంబంధించిన అధికారిక ప్రకటన ఇప్పటిదాకా అధికారికంగా వెలువడనప్పటికీ ప్రస్తుతం ఓ విషయం సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతోంది. తాజా సమాచారం ప్రకారం, ఈసారి ప్రదీప్ నిజంగానే పెళ్లి చేసుకోబోతున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. అవును… రాయలసీమ ముద్దుబిడ్డ, ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ నవ్యతో ప్రదీప్ పీకల్లోతు ప్రేమలో మునిగిపోయాడని… త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నారని తెలుస్తోంది. ఇకపోతే నవ్య ప్రదీప్ కి పర్సనల్ కాస్ట్యూమ్ డిజైనర్ గా వర్క్ చేసేది. వీరి ప్రేమ విషయం ఇద్దరి ఇంట్లో కూడా తెలిసి వాళ్లు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేయడంతో ఇప్పుడు వీరు పెళ్లి చేసుకోవడానికి సిద్ధమవుతున్నట్లు గుసగుసలు వినబడుతున్నాయి.

అయితే, ఆమధ్య ఈ విషయమై ప్రదీప్ స్పందించి ఆ వార్తలో నిజం లేదని, సింగిల్‌గా హ్యాపీగా వున్నానని చెప్పుకొచ్చినప్పటికీ ఇదే విషయం పదేపదే మీడియాలో చక్కెర్లు కొట్టడం కొసమెరుపు. వాస్తవానికి ‘పెళ్లిచూపులు’ టీవీ షో పూర్తయ్యేసరికి ప్రదీప్ పెళ్లి అయిపోతుందని అంతా అనుకున్నారు. కానీ, స్వయంవరం థీమ్‌తో 2018లో వచ్చిన ఈ టీవీ షో ఫ్లాప్ కావడంతో సరియైన హిట్ షోస్ కోసం ప్రదీప్ నిర్విరామంగా పనిచేస్తూ పోయారు. ఈ క్రమంలో ఆయన చేసిన ‘ఢీ 15’, ‘లేడీస్ అండ్ జంటిల్‌మేన్’ ఓటీటీ టాక్ షో ‘సర్కార్’ వంటి షోలు బాగా హిట్ అయ్యాయి. అదేవిధంగా, ‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా’ అనే సినిమాతో మంచి మ్యూజికల్ హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు ప్రదీప్.

ఇక ప్రదీప్ పర్సనల్ లైఫ్ విషయానికొస్తే… వీరి స్వస్థలం ఆంధ్ర ప్రదేశ్ లోని తూర్పుగోదావరి జిల్లా అమలాపురం. అయినప్పటికీ హైదరాబాద్‌లోనే పెరిగాడు ప్రదీప్ మాచిరాజు. అతను విగ్నన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ నుండి ఎలక్ట్రికల్ మరియు ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్‌లో బ్యాచిలర్ డిగ్రీని పూర్తి చేసాడు. అతను మొదటగా రేడియో మిర్చిలో రేడియో జాకీగా తన వృత్తిని ప్రారంభించాడు. ఆ తరువాత బుల్లితెరపై తిరుగులేని రారాజుగా ఎదిగాడు.