Hair Diet: సాధారణంగా కొందరిలో తరచూ జుట్టు సమస్యలు ఉంటాయి. అయితే శీతాకాలంలో అందరికీ జుట్టు రాలిపోవడం, ఊడిపోవడం ఎక్కువగా ఉంటుంది. అయితే ఈ సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి మార్కెట్లో దొరికే రకరకాల రసాయనాలతో కూడిన ప్రొడక్ట్స్ వినియోగిస్తున్నారు. ఇవి జుట్టు సమస్యలను మరింత పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. అయితే జుట్టు సమస్యలతో బాధపడేవారు తీసుకునే ఆహారాలపై కూడా శ్రద్ధ వహించాలి అంటున్నారు ఆరోగ్య నిపుణులు.. ఆ డైట్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
మీ డైట్ లో ప్రోటీన్, ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్స్, ఐరన్ అధికంగా ఉండే ఆహారాలు తీసుకోవడం వలన శరీరానికి పోషకాలు అంది జుట్టు రాలకుండా ఉంటుంది. ఆకుకూరల్లో విటమిన్ ఏ, సీ, కెరోటిన్, ఫోలేట్, పొటాషియం పుష్కలంగా ఉంటాయి. తరచూ ఆకుకూరలు తీసుకుంటే అందులో ఉండే కెరోటిన్ జుట్టుకి లభించి జుట్టు కుదుళ్ల నుంచి బలోపేతం చేయడానికి సహాయపడుతుంది. ఇందులో ఉండే గుణాలు స్కాల్ఫ్ ను ఆరోగ్యంగా హైడ్రేట్ గా ఉంచడానికి సహాయపడుతుంది.
క్యారెట్ లో విటమిన్ ఏ అధికంగా ఉంటుంది. ఇది కళ్ళకే కాదు జుట్టుకి కూడా మంచిది. జుట్టు ఆరోగ్యంగా ఉంచడానికి క్యారెట్ అద్భుతంగా సహాయపడుతుందని వైద్యులు చెబుతున్నారు. ప్రతిరోజు ఓ క్యారెట్ ని తింటే జుట్టు సమస్యలే రావు.
గుమ్మడికాయలో కూడా ఐరన్, బీటా కెరోటిన్ ఉంటుంది . ఇంకా ఇందులో ఉండే విటమిన్ ఏ జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది. గుమ్మడికాయ లేదా గుమ్మడి గింజలు తరచుగా తీసుకుంటే జుట్టు సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవు.
బొప్పాయి పండులో విటమిన్ ఏ, సీ ఉంటాయి. ఈ పండును తరచూ తీసుకోవడం వల్ల ఈ కాలంలో వచ్చే అనారోగ్య సమస్యలను తగ్గించడంతోపాటు.. జుట్టులోని చుండ్రును కూడా తగ్గించడానికి సహాయపడుతుంది.
ఆకుకూరలు, బొప్పాయి, గుమ్మడికాయ, క్యారెట్ తరచుగా తీసుకుంటే మిమ్మల్ని జుట్టు సమస్యలు వేధించు. ఈ నాలుగు ఒక పది రోజులు పాటు తీసుకుంటే మెరుగైన ఫలితాలు కనిపిస్తాయి. ఆ తరువాత మీ జుట్టు పెరగడం చూసి మీరు ఆశ్చర్యపోతారు.