Sri Reddy: శ్రీ రెడ్డి పరిచయం అక్కర్లేని పేరు.. వెండి తెరపై హీరోయిన్ గా మెరవాలని ఇండస్ట్రీలోకి వచ్చిన శ్రీరెడ్డి.. ఓ వెలుగు వెలిగేలోపే క్యాస్టింగ్ కౌచ్ ఇబ్బందులకు గురి చేశారంటూ.. పెద్ద ఎత్తున ఆరోపణలు చేసి వార్తల్లో నిలిచింది. ఇలా కాస్టింగ్ కౌచ్ ఆరోపణలతో ఏకంగా టాలీవుడ్ ను వదిలేసి చెన్నైకి వెళ్లి అక్కడే స్థిరపడిపోయింది.. శ్రీ రెడ్డి ఇక శ్రీరెడ్డి చెన్నైలో ఉంటూ యూట్యూబ్ వీడియోలతో అభిమానులను సందడి చేస్తోంది.
ఈ క్రమంలోనే యూట్యూబ్ మాత్రమే కాకుండా ఫేస్ బుక్, ట్విట్టర్ ఇంస్టాగ్రామ్ వంటి వాటిల్లో ఎంతోమంది ఫాలోవర్స్ లో సంపాదించుకుంది. శ్రీరెడ్డి సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. అంతేకాదు సోషల్ మీడియా ద్వారా భారీగానే సంపాదిస్తుందని టాక్ కూడా వినిపిస్తోంది. తాజాగా శ్రీ రెడ్డి సాయిబాబా గుడిలో తెల్లని చీరలో మెరిసిపోయింది. ఏ మాటక ఆ మాట చెప్పుకోవాలి తెల్లని చీరలో దేవకన్యలా మెరిసిపోయింది.
తెల్లటి చీర కట్టులో శ్రీ రెడ్డి కట్టుబొట్టులో అచ్చు తెలుగు ఆడపిల్లల కనిపించింది. సంప్రదాయం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. మొత్తానికి శ్రీ రెడ్డి సంప్రదాయబద్ధంగా రెడీ అయ్యి సాయిబాబా ఫోటో పక్కన నిలబడి స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇంత పద్ధతిగా ఉన్న శ్రీ రెడ్డి ఫోటోలు కూడా నెట్ ఇంత వైరల్ అవుతున్నాయి అంటే అతిశయోక్తి కాదు..
శ్రీరెడ్డి చెన్నైలో లగ్జరీ లైఫ్ కడుపుతోంది. శ్రీ రెడ్డి కేవలం యూటూబ్ ద్వారా మాత్రమే నెలకు 7 నుంచి 8 లక్షల వరకు ఆదాయం అందుకుంటుందని సమాచారం. ఇకపోతే శ్రీరెడ్డి ఓ రాజకీయ పార్టీ మద్దతు కూడా ఉందని ఆ పార్టీ తరఫున ఫండ్స్ కూడా వెళ్తుంటాయని పలువురు అంటుంటారు. మొత్తానికి శ్రీ రెడ్డి సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన అభిమానులకు కావలసిన అంత వినోదాన్ని మాత్రం అందిస్తుంది.