Shesh Supriya: అడవి శేష్ – సుప్రియ యార్లగడ్డ రిలేషన్ లో ఉన్నారంటూ గత కొంతకాలంగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. వాటన్నింటినీ ఎంత కొట్టి పారేసిన కూడా.. ఇటీవల క్రిస్మస్ సంబరాల్లో అడవిశేష్ మరోసారి అక్కినేని కుటుంబంతో కలిపించేసరికి.. ఆ వార్తలు మళ్లీ తెరపైకి వచ్చాయి . ఇక అడవి శేషు సుప్రియ ఇద్దరు ఆ ఫోటోలో పక్కపక్కనే ఉండటంతో ఆ వార్తలకు ఆజ్యం పోసినట్లయింది.. అడవి శేష్ – సుప్రియ యార్లగడ్డ పెళ్లి గురించి సోషల్ మీడియాలో ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ చక్కర్లు కొడుతోంది..
అడవి శేష్ సుప్రియ యార్లగడ్డ కంటే వయసులో చిన్నవాడు సుప్రియ నే వయసులో ఆరు సంవత్సరాలు పెద్దది. అంతేకాదు తనకి ఓ టీనేజ్ కూతురు కూడా ఉంది. ఆ కారణంగానే అడవి శేషు ఇంట్లో వీళ్ళ పెళ్ళికి ఒప్పుకోవడం లేదట. అంతేకాకుండా మరికొన్ని పర్సనల్ రీజన్స్ కూడా ఉండటంతో అడవి శేషు ఇంట్లో వీళ్ళ పెళ్లికి ససే మీరా ఒప్పుకోవడం లేదట..
ఇక అక్కినేని కుటుంబంలో కూడా సుప్రియ శేష్ పెళ్లికి ఒప్పుకోవడం లేదని ఎప్పటినుంచో వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా నాగార్జున ఒప్పుకున్నారని కొందరు అంటుంటే.. మరి కొందరేమో నాగార్జునకి ఈ పెళ్లి ఇష్టమేలేదని కొంతమంది అంటున్నారు. ఏది ఏమైనా కానీ రెండు కుటుంబాల వారు ఈ పెళ్లికి ఒప్పుకోవటం లేదని టాక్ మాత్రం నెట్టింటా వైరల్ అవుతుంది. ఇక సుప్రియ అడవి శేష్ ధైర్యం చేసి వాళ్ల పెళ్లి గురించి మీరే ఏదో ఒకటి చేయాలని నందమూరి బాలకృష్ణ ఇంటికి వెళ్లారట.
వీళ్ళ సమస్య విన్న తర్వాత నందమూరి బాలకృష్ణ వీరి అభ్యర్థనలో న్యాయం ఉందని ఆలోచించి వెంటనే నాగార్జునకి ఫోన్ చేసి మాట్లాడాడట.. వీళ్ళ పెళ్లి చేయమని కాసేపు చర్చించాడట. నాగార్జునతో గొడవపడి మరి సుప్రియ అడవిశేష్ పెళ్లి చేయడానికి బాలకృష్ణ ఒప్పించాడని. త్వరలోనే ఈ విషయం అధికారికంగా తెలుస్తుందని.. శేషు సుప్రియ త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కువ పోతున్నారని న్యూస్ మాత్రం వైరల్ అవుతుంది . అందుకు బాలయ్య బాబు సపోర్ట్ అంటూ ఇండస్ట్రీ వర్గాల్లో కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి.