Solar Gas : గ్యాస్ స్టవ్ లకు చెక్ పెట్టే సోలార్ స్టవ్.. ధర తక్కువే..!!

Solar Gas : గడిచిన కొన్ని సంవత్సరాల క్రితం వంట చేయాలంటే ఎక్కువగా మనం కట్టెల పొయ్యి లేదా కిరోసిన్ స్టవ్ ను ఉపయోగించుకునే వాళ్లము. కానీ కాలం మారుతున్న కొద్దీ ప్రజలు కూడా LPG స్టవ్ మీద ఆధారపడడం జరిగింది. అయినప్పటికీ కొన్ని గ్రామాలలో మాత్రం ఇంకా ఇప్పటికి కట్టెల పొయ్యి మీద వంట చేస్తూనే ఉన్నారు. కానీ LPG స్టవ్ మీద వంట చేయడం చాలా సులువుగా మారిపోయింది. కేవలం ఒక బటన్ నొక్కితే చాలు లైటర్ సహాయం లేకుండానే గ్యాస్ వెలిగించి ఇలాంటి సమస్య లేకుండా మనం వంట చేసుకోవచ్చు. కానీ సిలిండర్ అయిపోయిన తర్వాత దాన్ని మాత్రం నింపాల్సిందే..

పెరుగుతున్న గ్యాస్ సిలిండర్ ధరలను సామాన్య ప్రజలకు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్య పరిష్కరించడానికి సరికొత్తగా సోలార్ స్టవ్ ని కూడా అందుబాటులో తీసుకురావడం జరుగుతోంది. దీంతో గ్యాస్ సిలిండర్, కట్టెల పొయ్యి, స్టవ్ వంటి వాటికి చెక్ పెట్టవచ్చట. వాటి గురించి పూర్తి వివరాలు చూద్దాం. ప్రభుత్వం తరఫున ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ సంస్ధ ఒక సౌరశక్తితో వర్క్ చేసేటటువంటి స్టవ్ ను విడుదల చేయడం జరిగింది. ఇప్పుడు గ్యాస్ తో అవసరం లేకుండా.. కేవలం సూర్య కిరణాల ద్వారా పనిచేస్తుంది. దానిపైన వంట చేసుకోవచ్చు. దీనికి సూర్య నూతన్ చుల్హా స్టవ్ అనే పేరు పెట్టారు. ఈ స్టవ్ రీఛార్జ్ ఇంట్లో నుంచి ఉపయోగించుకోవచ్చు. ఈ స్టవ్ ను చమురు మంత్రి హార్దిప్ సింగ్ పూరీ తాజాగా తమ ఇంట్లో మొదలుపెట్టారు. ఇక ఈ స్టవ్ కి ఒక కేబుల్ కూడా ఉంటుంది.

A solar stove that checks gas stoves price also very low
A solar stove that checks gas stoves price also very low

ఈ కేబుల్ ఇంటిపై కప్పు నుంచి ఒక సోలార్ ప్లేట్ కు కనెక్ట్ చేయడం జరుగుతుంది. దీనివల్ల ఉత్పత్తి అయ్యే శక్తి స్టవ్ కు చేరుతుంది. దీని ధర రూ.18 నుంచి రూ. 30 వేల వరకు ఉంటుంది. అయితే దీనిని సబ్సిడీ కింద రూ.10 వేల రూపాయలకే ప్రజలకు అందుబాటులో వుంచే విధంగా ప్లాన్ చేస్తున్నారు. ఇకపోతే ఇష్టం యొక్క జీవితకాలం 10 సంవత్సరాలు వరకు ఉపయోగించుకోవచ్చు ఇక ఎలాంటి మదనపు ఖర్చు కూడా ఉండదు. ఇకపోతే మీరు నిర్విరామంగా వంట చేసుకున్న కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తవు. ఇక పోతే గ్యాస్ సిలిండర్ల ధరలు పెరుగుతున్న నేపథ్యంలో సామాన్యుడికి ఇబ్బంది కలగకుండా ఈ సోలార్ స్టవ్ మరింత ప్రయోజనంగా మారనుంది. ఇకపోతే మీరు కూడా సబ్సిడీ కింద ఈ స్టవ్ ను త్వరలోనే కొనుగోలు చేయడానికి అమ్మకానికి పెడుతున్నారు.