Dream : కలలో ఈ పండ్లు కనిపిస్తే ఏమవుతుందో తెలుసా..?

Dream : ప్రతి వ్యక్తి హాయిగా నిద్రలోకి జారుకున్న తరువాత కలలు కంటూ ఉంటాడు. ఆ కలలు వివిధ రకాలుగా వుంటాయి.అవి ఏంటంటే వస్తువులు, పాములు, ఎద్దులు తరుముటున్నట్లు,కప్పలు వచ్చి మీద పడ్డట్టు . ఇలా అనేక విషయాలు కనిపిస్తుంటాయి.కానీ రాత్రి పూట వచ్చే కలలకు అంత ప్రాధాన్యత ఇవ్వకుండా ఏముందిలే అనుకుంటారు. కానీ స్వప్న శాస్త్రం ప్రకారం కలలో కనిపించే ప్రతి వస్తువులకు వేర్వేరు ప్రాధాన్యత ఉంటుంది . ఎవరికైనా పండ్లు కలలో కనిపిస్తే అది మనకు భవిష్యత్తులో ఏమీ జరగబోతుందో ముందుగానే మనకు సంకేతాలు ఇస్తున్నట్లు అని స్వప్న శాస్త్రం పేర్కొన్నది.కలలు మన జీవితంలో ఎంతో ప్రభావన్నీ చూపుతాయి . కలలు మనపై చూపే ప్రభావం సానుకూలంగాను ఉండొచ్చు , ప్రతికూలంగా ఉండొచ్చు. సైకాలజి ప్రకారం, ఒక వ్యక్తి తన రోజు లో జరిగిన కొన్ని విషయాలు కలలలో కనిపిస్తుంటాయి.

కలలోని జరిగే సంఘటనలు మిశ్రమంగా ఉంటాయి, కొన్ని కలలు జ్ఞాపకంగాను, భయంకరంగాను ఉంటాయి. అయితే కొన్ని కలలను మెలకువ రాగానే మర్చిపోతారు. కొన్నిసార్లు కలలు పూర్తిగా అసంబద్ధమైనవి. కొన్ని చాలా భయానకంగా ఉంటాయి. చాలా సార్లు మనం కలలను ఎందుకలా వచ్చిందో ఆలోచిస్తుంటాము.కలలో కొన్ని వస్తువులు కనిపించడం శుభ , అశుభాలకు చిహ్నంగా పరిగణించబడుతుందని స్వప్న శాస్త్రంలో పేర్కొనబడింది. స్వప్న శాస్త్రం ప్రకారం, ప్రతి కల దాని స్వంత ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది. భవిష్యత్తులో జరిగే విషయాలు, మంచి చెడుల గురించి మనకు ముందుగానే సమాచారాన్ని అందిస్తుంది. కలలో కొన్ని పండ్లు కనిపిస్తే భవిష్యత్తుకు సంబంధించిన సంకేతాలు ఇస్తున్నట్లట. ఈరోజు ఆ పండ్లు.. ఫలితాలను గురించి తెలుసుకుందాం.

These fruits you seen In dreams what will happen
These fruits you seen In dreams what will happen

దానిమ్మ పండు.. దానిమ్మ పండు కలలో కనిపించిన సంతాన యోగ్యము కలుగునని నిపుణులు పేర్కొన్నారు. దానిమ్మరసం త్రాగినట్టు కలలో కనిపిస్తే పిల్లల భవిష్యత్తుకు చక్కటి మార్గం కనబడుతుంది అని అర్థం.

ఆరెంజ్ .. ఆరెంజ్ పండు కలలో కనిపిస్తే ఉద్యోగ వ్యవహారాల్లో చికాకులు తొలగి, ప్రమోషన్లు కలగుతాయని స్వప్నశాస్త్రంలో వివరించారు.

అరటిపండు పండు.. అరటిపండుకి మానవుని నిజజీవితంలో ఎంతో ప్రాధాన్యత వుంది. అలాంటి అరటిపండు కలలో కనిపిస్తే వివాహాక జీవితం మొదలవుతుంది అని అర్థం.

శాస్త్రాల ప్రకారం.. కొన్ని పండ్లు కలలో కనిపిస్తే,ముఖ్యంగా జామపండు కలలో కనిపిస్తే ప్రేమికుల మధ్య మరియు భార్యభర్తల మధ్య ప్రేమబంధం ఇంకా గట్టిగా బలపడుతుందని అర్థమట.

కలలో ఆకుపచ్చని ద్రాక్ష పండ్లు కనిపిస్తే.. ఆరోగ్యంగా ఉంటారని అర్ధం.. అంతేకాదు అనారోగ్యంతో బాధపడేవారు.. త్వరగా కోలుకుంటారట. స్వప్న శాస్త్రం ప్రకారం ఇవన్నీ నిజ జీవితంలో జరుగుతాయని కూడా చెప్పవచ్చు.