Jio 5G Plans : చౌక ధరకే జియో 5G ప్లాన్స్.. పూర్తి వివరాలివే..!

Jio 5G Plans : ఇక ఇప్పటికే ఇండియన్ మార్కెట్లో 5G నెట్వర్క్ తో రన్ అయ్యే ఎన్నో స్మార్ట్ మొబైల్స్ వివిధ రకాల కంపెనీల నుంచి పోటీ పడుతూ విడుదలవుతున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పటివరకు 5G స్మార్ట్ ఫోన్లు విడుదలయ్యాయి.. కానీ 5G నెట్వర్క్ ఇంకా లాంఛ్ కాలేదని చెప్పవచ్చు. కానీ త్వరలోనే దేశంలో టెక్ దిగ్గజం సంస్థ అయినటువంటి రిలయన్స్ జియో 5G నెట్వర్క్ ను పూర్తిగా తయారు చేయనుంది. అంతేకాదు 1Gpbs వేగాన్ని అందజేస్తుందని సమాచారం. ఇకపోతే ఈ జియో 5జి యొక్క ప్రారంభ తేదీ, ఇంటర్నెట్ వేగం, రీఛార్జి ప్లాన్లు ఇలా అన్నీ కూడా ఇప్పుడు చదివి తెలుసుకుందాం. ఇక జియో 5G లాంచింగ్ డేట్ ను ఇంకా అధికారికంగా ప్రకటించలేదు.

కానీ దేశంలో 5G సేవలను ప్రారంభించడం మొదటి మొబైల్ సర్వీస్ ప్రొవైడర్ గా జియో నిలిచింది. ఇక ప్రస్తుతం నివేదికల ప్రకారం జియో 5G సేవలు సెప్టెంబర్ నెలలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఇదే గనుక నిజమైతే స్పెక్ట్రం వేలం తర్వాత కేవలం రెండు మూడు నెలల్లోనే 5G సేవలను ప్రారంభించే యోచనలో ఉన్న ఎయిర్టెల్ ని జియో అధిగమిస్తుందని చెప్పవచ్చు. అంతేకాదు ప్రస్తుతం దేశవ్యాప్తంగా 1000 నగరాలలో జియో సేవలను రోల్ అవుట్ చేసే ప్రణాళికలను కూడా పూర్తి చేసినప్పటికీ.. మొదట్లో 13 నగరాల్లో మాత్రమే ఈ సేవలను అందిస్తారట. బెంగళూరు , హైదరాబాదు, ఢిల్లీ, చెన్నై, పూణే, లక్నో, జాంనగర్, గాంధీనగర్, అహ్మదాబాద్, చండీగఢ్ వంటి నగరాలలో మొదట్లో వైద్య సేవలు అందిస్తారు.

Jio 5G plans at low price full details
Jio 5G plans at low price full details

ఖచ్చితమైన కవరేజ్ ప్లానింగ్ కోసం హీట్ మ్యాపులు, రేట్ రేసింగ్ టెక్ అలాగే 3D మ్యాపులను ఉపయోగించి కస్టమర్ వినియోగ ఆదాయాన్ని లక్ష్యంగా చేసుకొని ఫైవ్ జి నెట్వర్క్ పై డేటా ఆధారంగా పనిచేస్తుందని భావిస్తున్నారు. వేగం విషయానికి వస్తే 5G సేవల ట్రావెల్స్ నిర్వహిస్తున్న నేపథ్యంలో వన్ జి పి బి ఎస్ కంటే ఎక్కువ 5జీ వేగాన్ని సాధించగలిగింది. ప్రస్తుతం జియో 5జి నెట్వర్క్ 420 ఎంబిపీఎస్ డౌన్లోడ్ స్పీడ్ .. 412 ఎంబిపీఎస్ అప్లోడ్ స్పీడు వరుసగా 11 ఎంఎస్ మరియు 9 ఎంఎస్ లేట్ ఎంసి జిట్టారులతో సాధించే అవకాశం ఉంది. మొత్తంగా చూసుకుంటే 4జి నెట్వర్క్ వేగం కంటే 5జి నెట్వర్క్ చాలా వేగంగా ఉంటుందని సమాచారం. ప్లాన్స్ విషయానికి వస్తే.. ప్రస్తుతం ఉన్న 4G ప్లాన్స్ కంటే 5జి ప్లాన్లకు పెద్దగా ఖర్చు ఉండదని కూడా జియో సంస్థ తెలిపింది ముందుగా మొబైల్ నెట్వర్క్ అప్డేట్లను ప్రోత్సహించడానికి ఫోర్ జి ధరలకే 5 G ను అందించే అవకాశం ఉందట.