సూపర్ స్టార్ మహేష్ బాబు అందం, నటన, స్టైల్ గురించి తెలుగు ప్రేక్షకులకు బాగా తెలుసు. ఇంకా ఆయన స్వాగ్ గురించి ప్రత్యేకంగా మాట్లాడాల్సిన అవసరం లేదు. మరీ ముఖ్యంగా ఆయన పరిగెత్తే స్టైల్ ని బట్టి ముఖం చూడకుండానే అక్కడ వున్నది మహేష్ బాబు అని ఇట్టే చెప్పేయవచ్చు. తనకంటూ అలా ఒక ప్రత్యేకమైన యాటిట్యూడ్ ను రూపొందించుకున్న మహేష్ బాబు అంటే ఘట్టమనేని అభిమానులకు మక్కువ ఎక్కువే. ఇక ఎవరు ఎన్నిసార్లు మహేష్ బాబుని ఇమిటేట్ చేసినా సరే మహేష్ లాగా వుండే వాళ్ళు మరొకరు ఉండరంటే అతిశయోక్తి లేదు. ఒకవేళ మహేష్ బాబు కొడుకు గౌతమ్ ఉన్నా కూడా అతను కృష్ణ పోలికలతో కనిపిస్తాడు. అంతే కాకుండా గౌతం చాలా సైలెంట్. తండ్రి యాటిట్యూడ్ ను స్వాగ్ ను ఎప్పుడు కూడా అతను మ్యాచ్ చేసిన దాఖలాలు లేవు.
ప్రస్తుతం గౌతమ్ చదువు నిమిత్తం విదేశాలలో బిజీగా ఉండడం వల్ల సోషల్ మీడియాలో పెద్దగా కనిపించిన దాఖలాలు లేవు. అయితే ఇపుడు చర్చంతా మహేష్ బాబు మేనల్లుడు గురించి. అవును, అచ్చం మహేష్ ను దింపడానికి ఇపుడు మేనల్లుడు రెడీగా ఉన్నాడు అంటూ అభిమానులు పండగ చేసుకుంటున్నారు. అతడే చరిత్ మానస్. మహేష్ బాబు అక్క ప్రియదర్శిని, బావ హీరో సుధీర్ బాబు కొడుకే ఈ చరిత్ మానస్ అని ఇక్కడ ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాలలో నటించిన చరిత్, ఇప్పుడు బాగా పెరిగిపోయాడు. అచ్చం మహేష్ బాబుకి జిరాక్స్ అంటే నమ్మి తీరాల్సిందే. అలా వున్నాడు మరి. ఆ నడక, నవ్వు, ఆటిట్యూడ్ మొత్తం కూడా మహేష్ బాబుకు జిరాక్స్ లాగా ఉన్నాడే అని అభిమానులు సోషల్ మీడియాలో గుసగుసలు ఆడుకుంటున్నారు.
ఇక సుధీర్ బాబు కూడా చరిత్ ను హీరో చేసే ప్రయత్నాల్లో ఉన్నట్లు టాలీవుడ్లో టాక్ నడుస్తోంది. ఒకవేళ ఈ కుర్రాడు హీరోగా మారితే జూనియర్ మహేష్ బాబు అనిపించుకోవడం ఖాయమని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. మరొకొందరైతే పొరపాటున మహేష్ కి పోటీ అయితే రాడు కదా అని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారట. కాగా ప్రస్తుతం చరిత్ మానస్ లుక్స్ కి సంబంధించిన అనేక ఛానెళ్లలో ఓ వీడియో చక్కెర్లు కొడుతోంది. కావాలంటే ఒకసారి అది తిలకించండి. ఇక్కడ చెప్పిన మాటలు అతిశయోక్తి కావని మీకే అనిపిస్తుంది. కాగా సుధీర్ చాలా ఎర్లీ ఏజ్ లో పెళ్లి చేసుకోవడం వలన ఇపుడు తన ఎత్తుగల కొడుకు వున్నాడు. త్వరలోనే అతగాడు ఓ రొమాంటిక్ లవ్ స్టోరీలో నటిస్తాడని విశ్వసనీయ వర్గాల సమాచారం.
ఇక మహేష్ సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం త్రివిక్రమ్ కాంబోలో ‘గుంటూరు కారం’ అనే సినిమా చేస్తున్న సంగతి విదితమే. కాగా ఈ సినిమాకు ప్రస్తుతం స్వల్ప విరామం ప్రకటించనున్నారు. విషయం ఏమిటంటే మహేష్ తన కొడుకుని చూడడానికి విదేశాలు వెళ్ళబోతున్నాడని వినికిడి. ఇక సుధీర్ కూడా ఓ రెండు మూడు సినిమాలతో బిజీగా వున్నాడు. అయితే సుధీర్ కి ‘సమ్మోహనం’ తరువాత చెప్పుకోదగ్గ సినిమా పడలేదనే చెప్పుకోవాలి. ప్రస్తుతం సుధీర్ దానిని భర్తీ చేసే పనిలో పడ్డాడు. మరోవైపు మహేష్ కూతురు సితార తండ్రికి తగ్గ తనయగా పేరు తెచ్చుకుంటోంది. కొన్ని కొన్ని యాడ్ ఫిలిమ్స్ లో నటిస్తూ కోట్లు గడిస్తోంది.