Hair Tips : మామిడి ఆకులతో పొడవైన జుట్టు మీ సొంతం.. ఎలాగంటే..?

Hair Tips : పండ్లలో రారాజు గా గుర్తింపు తెచ్చుకున్న మామిడిపండ్ల కు ప్రత్యేకమైన డిమాండు ఉంది. కేవలం వేసవి కాలంలో మాత్రమే అధికంగా దొరికే ఈ మామిడి పండ్ల వల్ల ఎన్నో రకాల పోషకాలు శరీరానికి లభిస్తాయి. ముఖ్యంగా మామిడి పండ్లు మాత్రమే కాదు మామిడి ఆకుల వల్ల కూడా ఎన్నో రకాల ప్రయోజనాలు మనకు కలుగుతాయి. అందుకే ఒక గంట సేపు మామిడి చెట్టు కింద కూర్చోవాలి అని వైద్యులు చెబుతుంటారు. ఇక మామిడి ఆకులలో మనకు విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్ బి కూడా పుష్కలంగా లభిస్తుంది. మామిడి ఆకులతో తయారు చేసుకున్న ఫేస్ మాస్క్ అలాగే హెయిర్ మాస్క్ వల్ల చర్మానికి జుట్టుకు ఎన్నో రకాల ప్రయోజనాలు కలుగుతాయి.

మామిడి ఆకులలో రైబోఫ్లేవిన్, థయామిన్, ఆల్కలాయిడ్స్, స్టెరాయిడ్, ఫినోలిక్, బీటాకెరోటిన్, ఫ్లేవనాయిడ్స్ వంటి పదార్థాలు కూడా పుష్కలంగా లభిస్తాయి. ఇకపోతే ఈ మామిడి ఆకులతో తయారు చేసుకుని ఫేస్ ప్యాక్ వల్ల చర్మం పై చికాకు దూరం అవడం తో పాటు పొడిబారడం వంటి సమస్యలు కూడా దూరం చేస్తుంది. మామిడి ఆకులను పూర్తిగా కాల్చి దాని నుంచి వచ్చే బూడిద ను కాలుతున్న ప్రదేశంలో లేదా పొడి చర్మంపై పూస్తే ఉపశమనం కలుగుతుంది. అలాగే చర్మం తాజాగా ఉంటుంది. మామిడి ఆకులతో తయారు చేసిన ఫేస్ మాస్క్ చర్మాన్ని మృదువుగా ఉంచడానికి సహాయపడుతుంది.

You own long hair with mango leaves
You own long hair with mango leaves

మీరు కొన్ని మామిడి ఆకులను మెత్తగా రుబ్బి అందులో ఒక చెంచా తేనె వేసి ఈ పేస్ట్ ను ముఖానికి అప్లై చేయాలి. తర్వాత మంచి నీటితో శుభ్రం చేస్తే ముఖం తాజాగా కాంతివంతంగా కనిపిస్తుంది.ఇక మామిడి ఆకులలో ఉండే విటమిన్ సి అలాగే విటమిన్ ఏ జుట్టు సంరక్షణకు చాలా బాగా సహాయపడుతుంది. ఇందుకోసం మీరు మామిడి ఆకులను పూర్తిగా గ్రైండ్ చేసి పేస్ట్ లా సిద్ధం చేసుకోవాలి. జుట్టుకు అప్లై చేసి పది నిమిషాలు ఆగిన తర్వాత తలస్నానం చేస్తే జుట్టు ఒత్తుగా పెరగడమే కాకుండా నల్లగా దృఢంగా మారుతుంది. జుట్టు రాలడం వంటి సమస్యలు కూడా దూరమవుతాయి.