Jobs : రాత పరీక్ష లేకుండానే ఎంపిక చేస్తున్నారు .. బంగారం లాంటి ఉద్యోగం . మిస్ అవ్వకండి

Jobs : తెలంగాణ నిరుద్యోగులకు గత కొన్ని రోజుల నుంచి ఎక్కువగా ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పుడు తాజాగా తెలంగాణ రాష్ట్రంలో ఉండే ఉస్మానియా మెడికల్ కాలేజీలో జనరల్ హాస్పిటల్ నందు ఒప్పంద ప్రాతిపదికన అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకి భర్తీ చేయనున్నట్లు తెలుస్తోంది. అందుకు సంబంధించి అధికారికంగా ఒక ప్రకటన కూడా వెలుబడడం జరిగింది. ఇక ఈ పోస్టులకు సంబంధించి పూర్తి సమాచారాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం.

Choosing without a written test A job like gold Do not miss
Choosing without a written test A job like gold Do not miss

1). మొత్తం పోస్టుల సంఖ్య..135 ఇందులో అసిస్టెంట్ ప్రొఫెసర్, సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులు కలవు..

2). ఖాళీల విభాగాలు : జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, ఓబిజీ, పిడియాట్రిక్, ఆర్థోపెడిక్స్, అనేస్థిషియా.

3). వయస్సు : అభ్యర్థుల వయస్సు 18 సంవత్సరాల నుంచి 44 సంవత్సరాల మధ్య ఉండాలి.

1).అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు 115 ఉన్నవి.

అర్హతలు : కోర్సును బట్టి సంబంధిత విభాగాలలో స్పెషలైజేషన్ లో MD/MS/DSB ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

జీతభత్యాలు : నెలకు రూ.1,25,000 ల వరకు జీతం చెల్లిస్తున్నారు.

2). సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులు: 20

అర్హతలు : అభ్యర్థులు ఎంబిబిఎస్ ఉత్తీర్ణతతో పాటు.. తెలంగాణ ఏపీ మెడికల్ కౌన్సిల్ లో రిజిస్ట్రేషన్ అయి ఉండాలి.

జీతభత్యాలు : అభ్యర్థులకు నెలకు రూ.52,000 వరకు జీతభత్యాలను చెల్లిస్తారు.

4).ఎంపిక విధానం : అకాడమిక్ మెరిట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేయడం జరుగుతుంది.

5). అడ్రస్ : The Principal, Osmania Medical College, Hyderabad-500095.

6). దరఖాస్తు ప్రక్రియ : ఆసక్తి కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ ఏప్రిల్ 4 ,2022

7). అభ్యర్థులు ఏదైనా పూర్తి సమాచారం కోసం http://osmaniamedicalcollege.org/ అధికారిక వెబ్ సైట్ ని సంప్రదించడం మంచిది. అభ్యర్థులు ఏ విభాగాలలో వారి యొక్క అనుభవం, అర్హతలు ఉన్నాయో వాటికి మాత్రమే అప్లై చేసుకోవాలి.