Mahabeera : ఈ చెట్టు విత్తనాలతో మోకాళ్లు, వెన్ను, నడుము నొప్పులకు చెక్..!

Mahabeera : మహాబీర చెట్టును అందరం నిత్యం చూస్తూనే ఉంటాం ఇది చూడడానికి తులసి మొక్కలా ఉంటుంది కాకపోతే మహాబీర చెట్టు ఆకులు మాత్రం కాస్త పెద్దవిగా ఉంటాయి.. ఈ చెట్టుని మహావీర తులసి, గంధ తులసి, సీమ తులసి, అడవి తులసి, కొండ తులసి, శిర్ణ తులసి అని రకరకాలుగా పిలుస్తూ ఉంటారు..! మహాబీర విత్తనాలు కీళ్లు , మోకాళ్లు, నడుము, వెన్ను నొప్పులు కు ఎలా నయం చేస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం..!మహబీర విత్తనాలకు కీళ్లలో అరిగిపోయిన గుజ్జు మరల వచ్చేలా చేస్తుంది.

ఈ విత్తనాలను రాత్రిపూట ఒక గ్లాసు నీటిలో వేసి నానబెట్టాలి. ఉదయం లేచాక పరగడుపున ఈ నీటిని తాగాలి. మహాబీర విత్తనాలు నీటిలో వేస్తే సబ్జా గింజలు లాగా తెల్లగా మారతాయి. ఈ గింజలకు జిగురు లాంటి పదార్థం ఉంటుంది. ఇదే మోకాళ్ళలో గుజ్జు వచ్చేలా చేస్తుంది. ఈ నీటిని ప్రతిరోజు క్రమం తప్పకుండా తాగుతుంటే మోకాళ్లలో అరిగిపోయిన గుజ్జు మరల వచ్చేలా చేస్తుంది. మహాబీర విత్తనాలు నీటిని క్రమం తప్పకుండా మూడు నెలలపాటు తాగితే మోకాళ్ళ నొప్పులు తగ్గుతాయి.

health benefits in Mahabeera
health benefits in Mahabeera

మూడు నెలల పాటు ఈ నీటిని తాగితే మెరుగైన ఫలితాలు మీరే చూస్తారు . ఈ విత్తనాల నీటిని తాగడం వలన క్రమంగా నడుము నొప్పి కూడా తగ్గుతుంది. కాకపోతే ప్రతి రోజూ తగలని గుర్తుంచుకోవాలి. మోకాళ్ళ నొప్పులు, కీళ్ల నొప్పులు, నడుం నొప్పి, వెన్ను నొప్పి ఈ అన్ని సమస్యలకు మహాబీర విత్తనాలు నీరు అద్భుతంగా పనిచేస్తాయి. అంతేకాకుండా ఈ నీటిని తాగితే బరువు తగ్గుతుంది. శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ ను కరిగిస్తుంది. క్యాన్సర్ బారీన పడకుండా ఈ విత్తనాలు మేలు చేస్తాయి.