Carrots : వీరు క్యారెట్ తినకపోవడమే మంచిదట..!!

Carrots : సాధారణంగా క్యారెట్ వల్ల శరీరానికి ఎన్నో రకాల ప్రయోజనాలు కలుగుతాయన్న విషయం అందరికి తెలిసిందే .. ముఖ్యంగా తరచుగా క్యారెట్ తినడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం కూడా ఉంటుందని మీకు తెలుసా..? ఒకవేళ క్యారెట్ అధికంగా తినడం వల్ల కొన్ని రకాల వ్యాధులు వచ్చే ఆస్కారం కూడా ఉంటుందంట. నిజానికి కొన్ని రకాల అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు క్యారెట్లు తినకపోవడమే మంచిది అని వైద్యులు సలహా ఇస్తున్నారు. అలాంటి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు క్యారెట్ ను అధికంగా తినడం వల్ల ఆరోగ్యం విషయం పక్కన పెడితే హాని కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయట.

నిజానికి క్యారెట్ తిన్న తర్వాత కొంత మందిలో అలర్జీలు కనిపిస్తూ ఉంటాయి. మరి కొంతమందికి శరీరంపై దురదలు వచ్చే అవకాశం ఉంటుంది . అంతే కాదు చర్మ సమస్యలు అలాగే అతిసారం బారిన పడవచ్చు. క్యారెట్ లో ఉండే బీటా-కెరోటిన్ శరీరంలోకి వెళ్లిన తర్వాత అది విటమిన్ ఎ గా మారుతుంది. రక్తంలోని కెరటిన్ అధికస్థాయిలో ఉంటుంది కాబట్టి కెరోటినిమియా కు కారణం అవుతుంది. ఫలితంగా క్యారెట్లు శరీరంలోకి వెళ్లిన తర్వాత చర్మం పసుపు రంగులోకి మారిపోతుంది. క్యారెట్ లో చక్కెర స్థాయి కూడా ఎక్కువగా ఉంటుంది. అటువంటి పరిస్థితులు మధుమేహ వ్యాధిగ్రస్తులు క్యారెట్ ను తినకపోవడమే మంచిది.

It is better that they do not eat carrots
It is better that they do not eat carrots

క్యారెట్లో ఉండే అధిక చక్కెర వల్ల అది శరీరంలోకి వెళ్లి గ్లూకోజ్ గా మారుతుంది. ఫలితంగా చక్కెర స్థాయిని వేగవంతం చేసి డయాబెటిస్ కు దారితీస్తుంది. పాలిచ్చే తల్లులు , గర్భిణీ స్త్రీలు కూడా క్యారెట్లు తినడం పట్ల కొంచెం జాగ్రత్త వహించాలి. గర్భం దాల్చినప్పుడు మీరు ఏం తిన్నా సరే అది మీ బిడ్డకు చేరుతుంది కాబట్టి బిడ్డ ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని తినకపోవడమే మంచిది. పాలిచ్చే తల్లులలో పాల రుచి మారిపోతుంది. నివేదిక ప్రకారం చిన్న పిల్లలకు క్యారెట్ అస్సలు మంచిది కాదు కాబట్టి పాలిచ్చే తల్లులు అలాగే గర్భవతులు క్యారెట్ తినకపోవడమే శ్రేయస్కరం.