Naga Dosham : నాగ దోషం ఉందని తెలుసుకోవడం ఎలా..?

Naga Dosham : ఎవరికైతే నాగదోషం ఉంటే.. అలాంటి వారికి ముఖ్యంగా సంతాన యోగ్యం ఉండదు అని పెద్దలు చెబుతూ ఉంటారు. అందుకే సంతానం కలగడానికి నాగదోషం ఉన్నట్లయితే వెంటనే పరిహారం చేయించుకుంటూ వుంటారు చాలామంది దంపతులు.. ముఖ్యంగా నాగదోషం ఉన్నట్లయితే కొంత మందికి సంతానం కలిగి ఆ తర్వాతి మిగలక పోవడం లేదా గర్భస్రావం జరగడం అనేవి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. ఎన్ని ప్రయత్నాలు చేసినా.. ఎన్ని రకాలుగా వైద్య చికిత్సలు అందించినప్పటికీ కూడా సంతాన అభివృద్ధి చెందకపోవడం వీటన్నిటికీ ముఖ్యంగా నాగదోషం కారణం అని పెద్దలు చెబుతూ ఉంటారు.

నాగ దోషం అంటే ఏమిటి ..? ఇది ఎలా తెలుసుకోవాలి అనే విషయాల గురించి తెలుసుకున్నట్లయితే.. వాళ్లు కానీ వాళ్ల పూర్వీకులు కానీ ఎవరైనా సరే నాగు పామును చంపి నట్లయితే లేదా రెండు పాములు కలిసి ఉన్న సందర్భంలో చూసినా నాగదోషం ఏర్పడుతుంది అట. అంతేకాదు మనుషులు తప్ప ఏ జంతువైనా సరే అవి రెండూ కలిసినప్పుడు బయట వారు చూడడానికి అస్సలు ఇష్టపడవు. ఇందులో ముఖ్యంగా సర్పాలు ఆడ మగ కలిసి నప్పుడు అవి చాలా సిగ్గు పడి ఇబ్బందులు ఎదుర్కొంటాయి. ఇలాంటి సమయంలోనే నాగదోషం వస్తుంది అని దీని వల్ల పాములు కూడా మన పై పగపడతాయని శాస్త్రాలు చెబుతున్నాయి.

How to know if there is Naga Dosham
How to know if there is Naga Dosham

నాగదోషానికి పరిష్కారం ఏమిటి అంటే.. ఎప్పుడైనా సరే నాగ పాము ని చంపితే దానికి తప్పనిసరిగా దహనసంస్కారాలు నిర్వహించి బూడిద చేయాలి. అలాగే దహనం చేసేటప్పుడు ఒక రాగి నాణెం అందులో వేసి తగలబెట్టడం వల్ల ఎటువంటి నాగ దోషం ఉండదు. ఒక వేళ తెలిసి తెలియక నాగు పామును చంపి దానిని అలాగే వదిలేస్తే తరాలు పోయినా నాగదోషం అనేది పట్టిపీడిస్తుందట. ఇకపోతే శాశ్వత పరిష్కారం ఏమిటి అనే విషయానికి వస్తే.. రామేశ్వరం వెళ్లి అక్కడ నాగుపాము ప్రతిమను ప్రతిష్ట చేస్తే.. మీకు తప్పకుండా సంతానం కలుగుతుందని తెలియజేస్తున్నారు. కొన్ని స్థలాలలో జంట నాగులు చెక్కబడి ఉంటాయి. వాటికి మనం పూజ చేసినా నాగదోషం పోతుందట.