ఎండాకాలంలో ఈ మసాలా దినుసులకు దూరంగా ఉండాల్సిందే..!!

భారతీయ వంటశాలలో వివిధ రకాల మసాల దినుసులను పూర్వం నుంచి ఉపయోగిస్తూ వస్తున్న విషయం తెలిసిందే. ఈ మసాలా దినుసులు ఆహారాన్ని మరింత రుచిగా మార్చడంలో సహాయపడతాయి.నిజానికీ మసాలా దినుసులు అన్ని ఆరోగ్యానికి మేలు చేస్తే మరికొన్ని నష్టాన్ని కూడా కలిగిస్తాయి. ముఖ్యంగా కొన్ని రకాల మసాలా దినుసులు వల్ల శరీరానికి కావలసిన పోషకాలు కూడా లభించవు. కూరకు మంచి రుచిని అందించే మసాలాదినుసులు వేసవికాలంలో తినడం వల్ల శరీరంలో వేడిని మరింత పెంచుతాయి. అందుకే కొన్ని రకాల మసాలా దినుసులను వేసవికాలంలో ఉపయోగించడం వల్ల శరీరానికి హాని కలుగుతుంది.

ఇక ప్రతి ఒక్కరూ ఈ విషయం తెలుసుకోవాలి కాబట్టి అందరికీ ఈ ఆర్టికల్ ను వాట్సాప్ లేదా ఫేస్ బుక్ ద్వారా షేర్ చేయండి.వేసవికాలంలో ఎలాంటి మసాలా దినుసుల కు దూరంగా ఉండాలి అంటే..అల్లం ఉపయోగించనిదే ఏ కూరకు మంచి రుచి కూడా రాదు అని చెప్పవచ్చు. ముఖ్యంగా అల్లంతో టీ తయారు చేసుకొని ఎక్కువగా తాగుతూ ఉంటారు. అధిక ఘాటు కలిగిన అల్లం ను ఎక్కువగా తీసుకోవడం వల్ల విపరీతమైన చెమట వస్తుంది. అలాగే మధుమేహం, రక్తస్రావం వంటి సమస్యలు ఉన్నవారు దీనిని అసలు తినకూడదు. ఈ కాలంలో అల్లం తినడం వల్ల గుండెల్లో మంట , విరేచనాలు ఇతర సమస్యలు కూడా తలెత్తుతాయి

You have to stay away from these spices in summer
You have to stay away from these spices in summer

ఇక వేసవికాలంలో వెల్లుల్లిని అధికంగా తినడం వల్ల నోటి దుర్వాసన, రక్తస్రావం , యాసిడ్ రిఫ్లక్స్ వంటి సమస్యలు అధికమవుతాయి. అలాగే శరీరంలో వేడి ఉత్పత్తి అవుతుంది. చలికాలంలో వెల్లుల్లి వల్ల ప్రయోజనాలు ఉన్నా.. వేసవి కాలంలో మాత్రం వీటికి దూరంగా ఉండాలి.శరీరంలో వేడిని అధికం చేస్తాయి. కొన్ని రకాల అలెర్జీలకు కూడా కారణమయ్యే నల్ల మిరియాలను వేసవికాలంలో అసలు తినకూడదు.వేసవి కాలంలో అధికంగా తినాల్సిన పదార్థాలు ఏమిటంటే పుదీనా , కొత్తిమీర వంటివి తినడం వల్ల శరీరానికి చల్లదనంతో పాటు కొన్ని రకాల అనారోగ్య సమస్యలు కూడా దూరమవుతాయి.