Fridge Water : ఫ్రిజ్ లో వుంచిన నీరు తాగుతున్నారా.. తస్మాత్ జాగ్రత్త.!!

Fridge Water : అసలే వేసవి కాలం బయట నుంచి ఇంట్లోకి రాగానే ఫ్రిజ్లో ఉంచిన చల్ల చల్లని నీటిని గొంతులో పోసుకుంటే కలిగే హాయే వేరు అని చెప్పవచ్చు. ఇక ఇటీవల కాలంలో టెక్నాలజీ మారుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరు అత్యాధునిక టెక్నాలజీతో కూడుకున్న రిఫ్రిజిరేటర్ లను ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా మనం చూస్తూనే ఉంటాం. రిఫ్రిజిరేటర్ ను కేవలం నీటి కోసం మాత్రమే కాకుండా తినే వాటిని అలాగే తాగే వాటిని కూడా స్టోర్ చేసుకోవడానికి ఉపయోగిస్తున్నారు. ఫలితంగా అనారోగ్య సమస్యలు ఎదురయ్యే అవకాశాలు ఎక్కువ. కొంతమంది వేసవి కాలంలో మాత్రమే ఫ్రిజ్ లో ఉంచిన నీటిని తాగితే.. మరికొంతమంది కాలంతో సంబంధం లేకుండా ఎప్పుడూ కూడా చల్లని నీటిని తాగడానికి ఇష్టపడుతుంటారు.

ఇలా ఎక్కువగా చల్లని నీటిని తాగడం వల్ల అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. చల్లని నీటిని తాగడం వల్ల కేవలం జలుబు, దగ్గు మాత్రమే వస్తుంది అనుకుంటే పొరపాటే.. ఇది జీర్ణ వ్యవస్థ పై ప్రభావం చూపుతుంది. ప్రతిరోజు చల్లని నీటిని తాగడం వల్ల ఆహారం జీర్ణం కావడం కష్టంగా మారుతుంది. ఫలితంగా కడుపు నొప్పి , వికారం, మలబద్ధకం లాంటి సమస్యలు తలెత్తుతాయి. చల్లని నీటికి దూరంగా ఉండటం చాలా మంచిది.. లేకపోతే గొంతు నొప్పి, ముక్కు కారడం వంటి సమస్యలు కూడా ఎదురవుతాయి. మైగ్రేన్ సమస్యతో బాధపడే వారు ఎట్టి పరిస్థితుల్లో కూడా చల్లని నీటిని తాగ రాదు. ఇలా తాగితే తలనొప్పి మరింత ఎక్కువ అవుతుందట.

Drinking water kept in the fridge
Drinking water kept in the fridge

2001లో జరిపిన ఒక అధ్యయనంలో ఈ విషయాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు. వ్యాయామం తర్వాత చల్లని నీటిని తాగడం అస్సలు మంచిది కాదు. ఎందుకంటే శరీరంలో మరింత వేడి ఉత్పత్తి అయ్యే అవకాశం ఉంటుంది. ఇక ఇది దీర్ఘకాలిక కడుపు నొప్పికి దారితీస్తుంది. రక్త ప్రసరణకు, జీర్ణక్రియ లకు, టాక్సిన్లు బయటకు వెళ్ళగొట్టడానికి గోరువెచ్చని నీరు చాలా చక్కగా ఉపయోగపడుతుంది. కాబట్టి చల్లని నీటికి దూరంగా ఉండాలి . గోరువెచ్చని నీటిని తాగుతూ ఉండాలి. మీకు తెలిసిన వారెవరైనా ఫ్రిజ్లో ఉంచిన నీటిని తరచుగా తాగుతుంటే ఈ ఆర్టికల్ వారికి వాట్సప్ లేదా ఫేస్ బుక్ ద్వారా షేర్ చేయండి.