Facial Skin : ముఖ చర్మం తెల్లగా మారాలంటే ఏం చేయాలో తెలుసా..?

Facial Skin : అందంగా ఉండడంతోపాటు తెల్లగా ఉండాలని ఆలోచిస్తూ ఉంటారు ప్రతి ఒక్క అమ్మాయి. ఇక ఈ నేపథ్యంలోనే బియ్యపు పిండి మచ్చలు, ముడతలు అలాగే పిగ్మెంటేషన్ ను దూరం చేయడంలో చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది. అలాగే శెనగపిండి కూడా మీ చర్మాన్ని శుభ్రపరిచే మంచి ఏజెంట్ గా పనిచేస్తుంది. అలాగే ఆరోగ్యకరమైన , ప్రకాశవంతమైన చర్మాన్ని నిర్వహించడానికి కూడా బాగా సహాయపడుతుంది. మీలో ఎవరైనా మచ్చలు, మొటిమలు, ముడతలు లేకుండా తెల్లటి చర్మం కావాలని ఆలోచిస్తున్నట్లు అయితే అలాంటి వారందరికీ ఈ ఆర్టికల్ వాట్స్అప్ ద్వారా షేర్ చేయండి.

ముఖ్యంగా బియ్యప్పిండిలో తేనెను జోడించడం వల్ల చర్మాన్ని లోపలినుండి తేమగా ఉంచుతుంది. ఇక ఈ మిశ్రమానికి రోజ్ వాటర్ ని కూడా యాడ్ చేయడం వల్ల ముఖానికి మంచి సహజమైన కాంతి కూడా లభిస్తుంది. ఇందుకోసం ఒక రెండు టేబుల్ స్పూన్ల బియ్యప్పిండి ఒక గిన్నెలో తీసుకోవాలి. ఇక అదే గిన్నెలో రెండు టేబుల్ స్పూన్ల శనగపిండి వేసి బాగా కలపాలి. ఇప్పుడు కొద్దిగా తేనె వేసి మెత్తటి పేస్టులాగా కలపాలి. అవసరమైతే కొంచెం రోజ్ వాటర్ ని కూడా యాడ్ చేయవచ్చు. బాగా మిక్స్ చేసిన ఈ మిశ్రమాన్ని ముఖానికి , మెడకు అప్లై చేసి 20 నిమిషాల పాటు అలాగే ఉంచాలి.

Do you know what to do to whiten facial skin
Do you know what to do to whiten facial skin

ఇక ఆ తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకుంటే మీరు ఆశించిన ఫలితాలను పొందవచ్చు.వారానికి రెండు సార్లు ఖచ్చితంగా ఈ ఫేస్ ప్యాక్ ను అప్లై చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఈవెన్ స్కిన్ టోన్ కలిగిన వాళ్లకి ఈ ఫేస్ ప్యాక్ చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది. ఇక బియ్యప్పిండి, శనగపిండి , తేనె మూడింటి మిశ్రమం చర్మాన్ని లోపలి నుంచి తేమగా ఉంచి మృదువుగా చేస్తాయి. ఈ ఫేస్ ప్యాక్ మీరు తప్పకుండా ఇంట్లో ఉపయోగించడం వల్ల ఎటువంటి ఖర్చు లేకుండా అందమైన తెల్లని చర్మం మీ సొంతం అవుతుంది.