Skin Care Tips : వేసవికాలంలో చర్మ సంరక్షణకు ఎలాంటి టిప్స్ పాటించాలో తెలుసా..?

Skin Care Tips : వేసవికాలంలో ఆరోగ్యంతో పాటు చర్మాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇక ముఖ్యంగా ఎండాకాలంలో చర్మ సంబంధిత సమస్యలను అధిగమించాలి అంటే ముందుగా వేడి నుంచి మనల్ని మనం కాపాడుకోవాలి. ఎండ నుంచి బయటపడాలి అంటే ముఖ్యంగా కాటన్ వస్త్రాలు లేదా వదులుగా ఉండే వస్త్రాలను ధరించడం వల్ల కొంతవరకు వేడిని తగ్గించుకోవచ్చు. ప్రతిరోజు సౌందర్య సంరక్షణ పై కూడా దృష్టి పెట్టాలి. వేసవి కాలంలో స్నానం చేయడానికి ముందే ఏదైనా ఎసెన్షియల్ ఆయిల్ లో స్నానం చేసే బకెట్ నీళ్ళలో కలిపి ఆ తర్వాత స్నానం చేయడం వల్ల చర్మం తాజాగా ఉండడమే కాదు చెమట దుర్వాసన కూడా దూరం అవుతుంది.

ఇక మీకు ఒకవేళ ఎసెన్షియల్ ఆయిల్ అందుబాటులో లేకపోతే వేపాకులను వేడినీటిలో వేసి ఆ నీటిని ఉపయోగించి స్నానం చేయడం వల్ల శరీరం మీద పేరుకుపోయిన బ్యాక్టీరియా కూడా దూరం అవుతుంది. అలాగే చెడు దుర్వాసన కూడా మీ చెంతకు రాదు. ఇకపోతే శిరోజాల విషయానికి వస్తే.. ఎప్పటికప్పుడు శిరోజాలను తేమగా ఉంచడానికి ప్రయత్నం చేయాలి. ఇక ఈ నేపథ్యంలోనే వారానికి కనీసం రెండుసార్లు జుట్టుకు నూనె పెట్టడం , హెయిర్ మాస్క్ వేయడం లాంటివి తప్పకుండా చేయాలి. ఇక హెయిర్ మాస్క్ వల్ల గడ్డి లాగా మారకుండా మృదువుగా, మెత్తగా , షైనీ గా మారుతుంది.

Do you know what tips to follow for skin care in summer
Do you know what tips to follow for skin care in summer

ఇక చర్మం విషయానికి వస్తే.. లోపల నుంచి పోషణ అందించడం తప్పనిసరి.. రోజుకు ఎనిమిది లీటర్ల నీటిని తాగడం , పోషకాహారం తీసుకోవడం వల్ల లోపల్నుంచి చర్మానికి పోషణ అందించవచ్చు. ప్రతిరోజు రాత్రి నిద్రించే ముందు తప్పకుండా ముఖం పై ఉన్న మేకప్ తీసివేసి శుభ్రమైన నీటితో ముఖం కడుక్కోవాలి. ఆ తర్వాత తేలికపాటి క్రీమును ముఖానికి రాసి నిద్రించాలి. ఇక కాళ్లకు, చేతులకు మాయిశ్చరైజర్ క్రీములు ఎప్పటికప్పుడు అప్లై చేస్తూ ఉండాలి. ఇలాంటి జాగ్రత్తలు పాటిస్తే తప్పకుండా వేసవికాలంలో చర్మ సౌందర్యాన్ని పొందవచ్చు. అందరికీ ఉపయోగపడే ఈ ఆర్టికల్ ను వాట్సప్ లేదా ఫేస్ బుక్ ద్వారా షేర్ చేయండి.