Heart Problems : గుండె జబ్బులు వచ్చినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..!!

గుండె తన పూర్తి సామర్థ్యాన్ని చూపకుండా ఫెయిల్యూర్ అయ్యే పరిస్థితిని మనం గుండెపోటుగా పరిగణిస్తాము. ఈ సమస్యతో బాధపడే వారు కొద్దిగా నడవగానే ఊపిరి సరిగా అందకపోవడం.. ఆయాసం వంటి ఎన్నో సమస్యలతో ఉక్కిరిబిక్కిరి అవుతూ ఉంటారు. ఈ సమస్యతో బాధపడుతున్న వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం..

ఉప్పు అధికంగా వాడకపోవడం: సాధారణంగా ఒంట్లో నీరు అధికంగా చేరడం వల్ల ఊపిరి అందకపోవడం.. ఆయాసం రావడం వంటి లక్షణాలు కనబడతాయి. అలాంటప్పుడు ఉప్పు వాడకాన్ని పూర్తిగా తగ్గించాలి. తక్కువ ఉప్పు మాత్రమే తీసుకోవాలి. పచ్చళ్ళు, బేకరీ ఉత్పత్తులు, చిరుతిండ్లు వంటివి పూర్తిగా దూరం పెట్టాలి.

పండ్లు , పాలు తీసుకోవడం : సాధారణంగా వాల్నట్, పాలు, పండ్లు, జీడిపప్పు, బాదం వంటివి తీసుకోవచ్చు. ఇవి ఆరోగ్యానికి మేలు చేస్తాయి.

What precautions to take when it comes to Heart Problems
What precautions to take when it comes to Heart Problems

విశ్రాంతి : గుండె జబ్బులు వచ్చిన వాళ్లు పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలని చాలామంది అనుకుంటారు. ఇది ఏమాత్రం సరికాదు. సమస్య అధికంగా ఉంటే తప్ప ఇతర పరిస్థితులలో పూర్తిస్థాయిలో విశ్రాంతి తీసుకోకూడదు. ముఖ్యంగా శరీరం సహకరించిన అంతవరకు అలాగే ఆయాసం రానంత వరకు కూడా మీరు శారీరకశ్రమ అలాగే వ్యాయామం, నడక వంటివి చేయవచ్చు.

ద్రవపదార్థాలు తీసుకోవడం : ఒంట్లో కి నీరు ఎక్కువగా చేరుతుంటే ద్రవపదార్థం తగ్గించాలి. నీరు అధికంగా చేరకపోతే మాత్రం ఖచ్చితంగా రోజుకు లీటర్ వరకు ద్రవ ఆహారాలను తీసుకోవచ్చు.

మానసికంగా ఆరోగ్యంగా ఉండాలి : సాధారణంగా గుండెపోటు రావడానికి ఎక్కువగా ఒత్తిడి, మానసిక క్షోభ అని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అంతే కాదు ఒక్కోసారి తీవ్రమైన భావోద్వేగాలు కూడా గుండె పోటుకు కారణం అవుతాయి. అంతేకాదు తీవ్రమైన మానసిక ఒత్తిడి కూడా గుండెపోటు రావడానికి కారణం అవుతుంది. ఉల్లాసంగా ..జీవితాన్ని సంతోషంగా గడపడానికి ప్రయత్నం చేయాలి. మీకు ఇష్టమైన పనులు చేయడం.. సంతోషంగా నలుగురిలో తిరగడం.. యోగా.. ధ్యానం చేయడం.. వాకింగ్ చేయడం ఇలాంటివి చేయడం వల్ల గుండెపోటు వచ్చిన వాళ్ళు జాగ్రత్త గా ఉండవచ్చు.