Jobs : ఆంధ్రప్రదేశ్ లో APVVP లో ఉద్యోగాలు విడుదల.. జీతం రూ.52 వేలు..!!

Jobs : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గత కొన్ని నెలల నుండి ఎక్కువగా వైద్య శాఖలో పలు పోస్టులను భర్తీ చేస్తూ ఉంది. ఇప్పుడు తాజాగా ఏపీ వైద్య విధాన పరిషత్ (APVVP) లో కమిషనర్ కార్యాలయం విశాఖపట్నం జిల్లాలో ఒప్పంద ప్రాతిపదికంగా పలు పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాల్సిందిగా కోరుతుంది. ఈ పోస్టులకు సంబంధించి ముఖ్య సమాచారాన్ని తెలుసుకుందాం.

1). మొత్తం పోస్టుల సంఖ్య : ఇందులో మొత్తం 53 పోస్టులు కలవు.
పోస్టుల వివరాల విషయానికి వస్తే.. ఆడియో మెట్రీ షియన్, ఫార్మసిస్ట్, థియేటర్ అసిస్టెంట్, రేడియో గ్రాఫర్లు, పోస్టుమార్టం అసిస్టెంట్, ల్యాబ్ అటెండెంట్, బయో మెడికల్ ఇంజనీర్, ఎలక్ట్రీషియన్, ప్లంబర్ 20 పోస్టులను భర్తీ చేయనున్నారు.

2). వయస్సు : అప్లై చేసుకొనవలనుకునే అభ్యర్థుల వయస్సు 18 నుంచి 42 సంవత్సరాల మధ్య ఉండాలి.

3). జీతభత్యాలు:అభ్యర్థులకు నెలకు రూ.15,000 నుంచి.. రూ.52,000 రూపాయల వరకు జీవితాన్ని చెల్లిస్తారు.

Jobs released in APVVP in Andhra Pradesh Salary Rs 52 thousand
Jobs released in APVVP in Andhra Pradesh Salary Rs 52 thousand

4). అర్హతలు : అభ్యర్థులు పోస్టులు బట్టి పదవ తరగతి, బిఎస్సి, డిప్లమా, ఇంటర్, బీటెక్ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత విభాగంలో అనుభవంతో పాటు ఆంధ్రప్రదేశ్ పారామెడికల్ బోర్డు లో రిజిస్ట్రేషన్ అయి ఉండాలి.

5). అభ్యర్థులను ఎంపిక విధానం : అభ్యర్థులు అకాడమీ మెరిట్, అనుభవం, రిజర్వేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేయడం జరుగుతుంది.

6). దరఖాస్తు విధానం : ఆసక్తి కలిగిన అభ్యర్థులు కేవలం ఆఫ్లైన్ ద్వారానే అప్లై చేసుకోవాలి.

7). అడ్రస్ : District Coordinator of Hospital Services (APVVP), Government Hospital, Pendurti, Visakhapatnam.

8). దరఖాస్తు ఫీజు : జనరల్ అభ్యర్థులు రూ.500 ,sc/st/ bc/ews అభ్యర్థులకు ఫీజు రూ. 300, దివ్యాంగులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది.

9). ఆసక్తి గల అభ్యర్థులు ఈ నెల 31 వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలి. పూర్తి సమాచారం కోసం అధికారిక వెబ్సైట్ https://visakhapatnam.ap.gov.in/ లో చూసుకోవాలి.