Health Benefits : ఆరోగ్యానికి దోస్తీ ఈ ఆకులు..!

Health Benefits : ఆకుపచ్చని కూరగాయలలో దొండకాయ కూడా ఒకటి.. కూర, పచ్చడి, ఫ్రై ఏదైనా దొండకాయ ఉండాల్సిందే.. దొండకాయ లో బోలెడు పోషక విలువలు ఉన్నాయని అవి మన ఆరోగ్యానికి మేలు చేస్తాయని అందరికీ తెలిసిందే.. దొండకాయలే కాదు ఆకులు కూడా ఆరోగ్యానికి మేలు చేస్తాయి..! అవెంటంటే..!?దొండకాయ ఆకులలో బోలెడు పోషక విలువలు ఉన్నాయి. ఈ ఆకుల రసాన్ని గర్భిణీ స్త్రీలకు పోషకాహారంగా చెప్పవచ్చు. దొండకాయ ఆకుల రసాన్ని ముఖానికి రాసుకుంటే మొటిమలు వాటి తాలూకు మచ్చలను పోగొడుతుంది.

ముఖాన్ని కాంతివంతంగా చేస్తుంది. దొండకాయ ఆకులు, నల్ల ఉమ్మెత్త ఆకులు, చిక్కుడు ఆకులను సమాన మోతాదులో తీసుకోవాలి. వాటిని శుభ్రంగా కడిగి మెత్తగా నూరుకొని రసం తీసుకోవాలి. ఇలా తీసుకున్న రసాన్ని అరికాళ్లకు రాసుకుంటే అరికాళ్ళ మంటలు తగ్గుతాయి. అరికాళ్ళ మంటలు నుంచి తక్షణ ఉపశమనాన్ని పొందవచ్చు.దొండకాయ ఆకుల రసం మధుమేహులకు వరం. ప్రతిరోజు 30 ML దొండకాయ ఆకుల రసాన్ని తాగితే టైప్ 1, టైప్ 2 డయాబెటిస్ తగ్గుతుంది.

Health Benefits of Ivy Leaves
Health Benefits of Ivy Leaves

దొండకాయ ఆకులలో యాంటీ సెప్టిక్ గుణాలు ఉంటాయి. ఈ ఆకులను ముద్దగా నూరి కొని గజ్జి, తామర, దురద ఉన్నచోట ఆ పేస్ట్ రాస్తే చర్మ సంబంధిత సమస్యలు తగ్గిపోతాయి. దొండకాయ ఆకుల రసం లో కొద్దిగా పెరుగు కలిపి ప్రతిరోజు తీసుకుంటే కామెర్లు తగ్గుతాయి. కాలేయ సంబంధిత సమస్యలు రాకుండా చేస్తుంది. దొండకాయ ఆకుల రసం, ఆవాల పొడి, వెల్లుల్లి రసం ఈ మూడింటిని కలిపి చిన్న చిన్న గోళీలుగా చేసుకోవాలి. ప్రతిరోజు ఈ ఉండను నీటిలో కలిపి తీసుకుంటే స్త్రీలలో పీరియడ్స్ సమయంలో వచ్చే నొప్పులు తగ్గుతాయి.