Heart Disease : గుండె జబ్బులను అడ్డుకునే ఆహార పదార్థాలు ఏమిటి అంటే..?

Heart Disease : ఈ మధ్య కాలంలో చాలా మంది చిన్న వయసు కే గుండెపోటుతో మరణించడం..ఇలా చాలా విషాదకరమైన సంఘటనలను మనం చూస్తూనే ఉన్నాం.. ఇక గుండెజబ్బులు రాకుండా ఉండాలి అంటే కచ్చితమైన ఆహార పదార్థాలను తీసుకోవాల్సి వుంటుంది. ఇక రక్తాన్ని శుద్ధి చేయడంలో ఉపయోగపడే కొన్ని ఆహార పదార్థాలలో అల్లం కూడా ఒకటి. ఇక మీరు తీసుకునే ఆహార పదార్థాలలో అల్లం జోడించడం వల్ల ఆహారానికి మంచి రుచి లభించడం తోపాటు ఆరోగ్యానికి కూడా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా అల్లంతో టీ తయారు చేసుకొని తాగడం వల్ల చాలా మేలు జరుగుతుందని అనేక ఆరోగ్య సమస్యలు నయం అవుతాయని పరిశోధనలు చెబుతున్నాయి.

రక్తం తక్కువ అవుతున్న కొద్దీ గుండెల్లో మంట వచ్చే ప్రమాదం ఉంటుంది. అలాంటి పరిస్థితులను అల్లం తీర్చి వేస్తోంది . ముఖ్యంగా మిరపపొడి కూడా మన రక్తాన్ని పలుచగా చేయడానికి ఉపయోగపడే లక్షణాలను కలిగి ఉంటుంది. కాబట్టి కారంపొడి కి బదులు మిరియాల పొడిని ఉపయోగిస్తే సరిపోతుంది . అంతేకాదు మిరియాలపొడి రోజు వారి ఆహారంలో చేర్చుకోవడం వల్ల రక్తపోటు తగ్గి రక్త ప్రసరణ అనేది బాగా మెరుగుపడుతుంది. ముఖ్యంగా సాల్మన్ చేపలు, ట్యూనా చేపలు తినడం వల్ల వాటిలో ఉండే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు రక్తాన్ని పెంపొందించడంలో సహాయపడతాయి.

What are the foods that prevent heart disease
What are the foods that prevent heart disease

శరీరంలో పేరుకుపోయిన కొవ్వును తగ్గించడంలో బాగా సహాయపడుతాయి. అంతేకాదు రక్తం గడ్డ కట్టే అవకాశాలు కూడా చాలా తక్కువ. ఒక గ్లాస్ రెడ్ వైన్ ప్రతి రోజు తాగడం వల్ల గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఉండదట. దాల్చిన చెక్కను అధికంగా తింటే ఆరోగ్యానికి హానికరమని వైద్యులు చెబుతున్నారు. ముఖ్యంగా దాల్చిన చెక్క ను ఎక్కువగా తినడం మానేయండి. ఎక్కువగా గుండె ఆరోగ్యంగా ఉండాలంటే ఫాస్ట్ ఫుడ్.. మసాలా వంటి పదార్థాలకు దూరంగా ఉండాలి. ఆరోగ్యాన్ని పెంపొందించే ఇలాంటి ఆర్టికల్ ను వాట్సప్ లేదా ఫేస్ బుక్ ద్వారా షేర్ చేయండి.