Mirror : లేవగానే అద్దం చూస్తున్నారా..? తస్మాత్ జాగ్రత్త..!!

Mirror : పూర్వకాలంలో మన పెద్దలు ప్రతిరోజూ ఏదో ఒక నియమాన్ని పాటించేవారు. అందుకే వారు ఆరోగ్యంగా, ఆనందంగా , ఎక్కువ కాలం జీవించారు. కానీ ఇప్పుడున్న తరం వారు అప్పుడప్పుడు మాత్రమే దేవుడిని తలుస్తున్నారు. అంతేకాదు కష్టం వచ్చినప్పుడు మాత్రమే దేవుడిని దర్శించుకోవడం అలవాటుగా మారిపోయింది. ముఖ్యంగా ఇంటికి ఇళ్ళాలి ప్రవర్తనే ఆ ఇంట్లో వారి సంపాదన, ఆరోగ్యం నిర్ణయిస్తుందని చెబుతారు పెద్దలు. క్రమం తప్పకుండా కొన్ని నియమాలు పాటిస్తే ఆరోగ్యం , సంపద , ఆనందాన్ని పొందవచ్చు.

సూర్యోదయానికి కంటే ముందే నిద్ర లేచి ఇంటిని శుభ్రం చేయాలి. సూర్యోదయం తర్వాత ఇంటిని శుభ్రం చేస్తే ఆ ఇంట్లో దరిద్రం తాండవిస్తుంది. ఏవైనా పనులు ప్రారంభించాలి అనుకున్నపుడు శుక్లపక్షం లోనే చేయాలి. బహుళ పక్షంలో చేస్తే ఏది కలిసి రాదు. ఎవరూ కూడా దిండు పై కూర్చోరాదు. ముఖ్యంగా ఆడవాళ్ళు అసలుకే కూర్చోరాదు. కూర్చుంటే వారిని కష్టాలు వెంటాడతాయి. మంగళవారం రోజు గడ్డం, క్షవరం లాంటివి చేసుకోకూడదు. ఇక పెళ్లైన మహిళలు రాత్రివేళ కమ్మలు, గాజులు లాంటి తీస్తూ ఉంటారు.

Do you look in the mirror when you wake up
Do you look in the mirror when you wake up

అలా ఎప్పటికీ తియ్యకూడదు.ఏదైనా ఇంట్లో బాధాకర సంఘటనలు జరిగినప్పుడు పలకరించడానికి వచ్చే వారికి ఎదురు వెళ్ళి ఆహ్వానించ కూడదు. అలా చేస్తే ఎదురు ఆహ్వానించినట్లు అవుతుంది. అలాగే పలకరించి వారు పోయేటప్పుడు వెళ్లి వస్తానని కూడా చెప్పకూడదు. స్త్రీలు ఎప్పుడూ కూడా వేరొకరి కలలో పూలను ధరించకూడదు. ఉదయం లేవగానే మన ముఖాన్ని అద్దంలో ఎప్పుడూ కూడా చూసుకోకూడదు . ఇలా చేయడంవల్ల పరమ దరిద్రం చుట్టుకుంటుంది. ఇక కావలసి వస్తే ఉదయం లేవగానే మీ అరచేతులను గట్టిగా రుద్దుకొని కళ్ళకు అద్దుకోవాలి అప్పుడు బ్రహ్మ జ్ఞానం మనకు కలుగుతుందట. ఇలాంటి చిన్నచిన్న పరిహారాలు జాగ్రత్తలు పాటిస్తే ఆర్థిక సంపద పెరుగుతుంది.