Lakshmi Devi : ఏ ఇంట్లో అయితే దీపం మంగళం గా వెలుగుతుందో ఆ ఇంట్లో లక్ష్మి దేవి తాండవం ఆడుతుంది అని పెద్దలు చెబుతూ ఉంటారు. అంతే కాదు ఏ ఇంట్లో అయితే ఆడ పిల్లలు సంతోషంగా కలకలలాడుతూ తిరుగుతూ ఉంటారో ఆ ఇంటిని లక్ష్మీదేవి విడిచి వెళ్ళ లేదు అని పండితులు కూడా చెబుతూ ఉంటారు. ఇకపోతే ప్రతి రోజు దీపారాధన చేయడం వల్ల అన్ని శుభాలే కలుగుతాయి అని చాలా మందికి తెలియదు. ఒకవేళ తెలిసిన సమయం లేక బిజీ లైఫ్ స్టైల్ కారణంగా పూజామందిరంలో కనీసం అయిదు నిమిషాలు కూడా సమయాన్ని గడపలేక పోతున్నారు. ఫలితంగా ఇంట్లోకి నెగటివ్ ఎనర్జీ ప్రవేశించి ఎన్నో కష్టాలు కొని తెచ్చుకుంటున్నారు.
నిత్య దీపారాధన చేయడం వల్ల ఎలాంటి విజయాలు కలుగుతాయి అనే విషయాలను కూడా మనం తప్పకుండా తెలుసుకోవాలి.ముఖ్యంగా ఇల్లు ఎంత అందంగా అలంకరిస్తారో.. అంతకు మించి ఇంటిని లక్ష్మీదేవి స్వరూపంగా పవిత్రంగా చూసుకుంటాం. ఎప్పుడూ కూడా సుఖ సంతోషాలతో వర్ధిల్లాలి అని, శాంతి పూజలు, హోమాలు కూడా చాలా మంది చేస్తూ ఉంటారు. ముఖ్యంగా గుడులు , గోపురాలు తిరిగి ప్రత్యేక పూజలు వ్రతాలు కూడా చేస్తారు. ఎప్పుడైతే మనం కొన్ని ఆచారవ్యవహారాలను వదిలేస్తామో బాధలు కుటుంబ కలహాలను కలుగజేస్తాయని పండితులు హెచ్చరిస్తున్నారు. ఇకపోతే ఇంటిని దుష్ట శక్తులు చుట్టుముట్టే క్రమంలో మనం నివసించే ఇంట్లో ఎన్నో రకాల గొడవలు, కలహాలు, ఒకరికొకరు పరస్పరం వంటి సమస్యలు తలెత్తుతాయి.
ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోవడమే కాకుండా ప్రశాంతత కోల్పోవడం.. ఒక్కోసారి ప్రాణాలు కోల్పోయే అవకాశం కూడా ఉందట. ఇలాంటివన్నీ తొలగిపోవాలి అంటే ప్రతి రోజూ ఉదయం , సాయంత్రం ఇంటిని శుభ్రం చేసి పూజామందిరంలో దీపం వెలగాలి అని పండితులు చెబుతున్నారు . ప్రతిరోజు సాయంత్రం తులసి కోట ముందు దీపం పెట్టడం వల్ల లక్ష్మీదేవి మన ఇంట్లో నే ఉంటుంది అని, అప్పులు బాధలు తొలగిపోయి సుఖసంతోషాలతో, ఆర్థిక సంపదలతో తులతూగుతారని సమాచారం. నమ్మకం ఉన్నా..లేకున్నా తప్పకుండా దీపం వెలిగించాలి .అప్పుడే దుష్టశక్తులు తొలగిపోయి సుఖసంతోషాలు కలుగుతాయి. దీపం అనేది నెగిటివ్ ఎనర్జీ ని బయటకు పంపి పాజిటివ్ ఎనర్జీని సంతరించుకుంటుంది.