Weight Loss : బరువు తగ్గాలంటే ఇలా చేయక తప్పదు..!!

ఇటీవల కాలంలో మారుతున్న జీవనశైలికి అనుగుణంగా చాలామంది తీసుకునే ఆహారంలో మార్పులు సంభవిస్తున్నాయి. ఎప్పుడు చూసినా పని మీద శ్రద్ధ పెట్టడం.. ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోకపోవడం.. ఒక్కోసారి తీసుకునే ఆహారాన్ని కూడా మరిచి పోవడం వంటి కారణాల వల్ల ఊబకాయం వచ్చే అవకాశం ఉంటుంది . ఇది మాత్రమే కాదు ఎసిడిటీ , గ్యాస్ వంటి సమస్యలు కూడా తలెత్తుతున్నాయి. ఇక పోతే బరువు తగ్గాలని ప్రయత్నం చేసే వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. వర్క్ ఫ్రం హోం పేరిట కుర్చీలకు.. ల్యాప్టాప్లకు పరిమితం అయ్యే వారి సంఖ్య కూడా పెరుగుతున్న నేపథ్యంలో బరువు పెరిగే వారు కూడా ఎక్కువ అవుతున్నారు.

ఇకపోతే ఆరోగ్యకరమైన డైట్ ను మీరు ఎంచుకోవడం మంచిది. అయితే మీరు ఎంచుకునే డైట్ లో తప్పకుండా బార్లీ నీళ్లు ఉండి తీరాల్సిందే. శరీరంలో అధిక బరువును తగ్గించడానికి ఈ బార్లీ నీళ్ళు చాలా చక్కగా పనిచేస్తాయి. అంతేకాకుండా గోరువెచ్చని నీటిలో తేనె వేసుకొని తాగితే కూడా బరువు తగ్గవచ్చు అని వైద్యులు చెబుతున్నారు. ఇకపోతే ఈ పానీయం ఒక వైపు తీసుకుంటూనే ఉదయం, సాయంత్రం కనీసం ఒక గంట పాటు నడిచే అలవాటు చేసుకోవాలి. వీటితో పాటు వ్యాయామం చేయడం, ఎక్సర్సైజు , యోగా వంటివి చేయడం వల్ల బరువు తగ్గడంతో పాటు మనసు ప్రశాంతంగా శరీరం తేలికగా అనిపిస్తుంది.కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉండే ఆహారాన్ని అస్సలు తీసుకోకూడదు ఎందుకంటే ఈ కార్బోహైడ్రేట్ల వల్ల బరువు పెరిగే అవకాశం కూడా ఉంటుంది.

Weight Loss in Sprouted seeds
Weight Loss in Sprouted seeds

అంతేకాకుండా మొలకెత్తిన గింజలు తింటే బరువు తగ్గే అవకాశం కూడా ఉంటుంది. ముఖ్యంగా చియా సీడ్స్ మీ డైట్ లో ఉండేలా చూసుకోండి. అలాగే డిన్నర్ లో ఇడ్లీ దోశ వంటివి తీసుకుంటే చాలా మంచిది. నూనె పదార్థాలు , వేయించిన పదార్థాలకు దూరంగా ఉండాలి. కొత్తిమీర రసం , మునగాకు రసం, క్యారెట్, దోసకాయ, బీట్రూట్ ,ఫ్రూట్ సలాడ్, వాల్నట్, దోసకాయ విత్తనాలు కూడా మీరు మీ బ్రేక్ ఫాస్ట్ లో ఒక భాగముగా తీసుకోవచ్చు. ఇక ఎండాకాలం లో ఎక్కువగా మజ్జిగ, కొబ్బరినీళ్లు తీసుకోవడం వల్ల మరింత బరువు తగ్గే అవకాశం ఉంటుంది . అలాగే ఎండాకాలంలో శరీరాన్ని డీహైడ్రేషన్ కాకుండా కాపాడుకోవచ్చు.