Defense Jobs : కేవలం పదవ తరగతి అర్హతతోనే డిఫెన్స్ లో ఉద్యోగాలు..!!

Jobs : కేంద్ర ప్రభుత్వం వరుసగా నోటిఫికేషన్లు ఇస్తూ నిరుద్యోగు లకు శుభవార్తను అందిస్తూనే ఉంది.. ఇప్పుడు తాజాగా భారత ప్రభుత్వం రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన రూర్కీ లోని బెంగాల్ లో ఇంజనీరింగ్ గ్రూప్స్ అండ్ సెంటర్ లో సివిలియన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు కేవలం పదో తరగతి అర్హతతో నే భర్తీ చేయనుంది. ఖాళీల సంఖ్య జీతభత్యాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Jobs in Defense with only tenth class qualification
Jobs in Defense with only tenth class qualification

1). మొత్తం ఖాళీల సంఖ్య 52 : ఇందులో సివిలియన్ పోస్టుల్లో (వాషర్ మాన్, బార్బర్, కుక్, MTS, సివిల్ ట్రేడ్ ఇన్స్పెక్టర్, లస్కర్, స్టోర్ కీపర్, ఎల్డిసి) వంటి పోస్టులను భర్తీ చేయనుంది.

2). వయోపరిమితి ; అభ్యర్థులు వయసు 18 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉండాలి.

3). జీతభత్యాలు; ప్రతి నెల రూ.19,900 నండి రూ.45,275 వరకు జీతభత్యాలు చెల్లిస్తారు.

4). అర్హతలు : ఈ పోస్టులకు అప్లై చేసే అభ్యర్థులకు మెట్రిక్యులేషన్/తత్సమాన అర్హత సాధించి ఉండాలి.

5). ఎంపిక విధానం : అభ్యర్థులకు ముందుగా రాత పరీక్ష నిర్వహిస్తారు. ఆ తర్వాత ఫిజికల్ టెస్ట్, ప్రాక్టికల్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేయడం జరుగుతుంది.

6). దరఖాస్తు విధానం : ఆసక్తి కలిగిన అభ్యర్థులు పూర్తి వివరాలను దరఖాస్తు ఫామ్ లో నింపి.. కింద అడ్రస్ కి పోస్టు ద్వారా పంపించవలెను.అడ్రస్ :కమాండెంట్‌ బెంగాల్‌ ఇంజనీర్‌ గ్రూప్‌ అండ్‌ సెంటర్‌, రూర్కీ ఉత్తరప్రదేశ్‌- 247667

7).దరఖాస్తు విధానం:
ఈ పోస్టులకు ఆసక్తి కలిగిన అభ్యర్థులు కేవలం ఆఫ్లైన్ ద్వారానే ఏప్రిల్ 10వ తేదీ వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ https://joinindianarmy.nic.in/Authentication.aspx నుండి అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని అప్లికేషన్ ను పూర్తి చేసి స్పీడ్ పోస్ట్ ద్వారా పంపి వలెను. ఇక వాటితో పాటుగా తమ మార్కులను కూడా జత చేసి పంపవలెను.