Beauty Tips : బ్యూటిఫుల్ చర్మాన్ని పొందాలి అంటే ఈ చిట్కా పాటించండి..!!

Beauty Tips : బ్యూటిఫుల్ చర్మాన్ని పొందాలంటే తప్పకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా అందమైన చర్మం కావాలి అంటే చక్కటి పరిష్కారం పెరుగు అని చెప్పవచ్చు. ముఖ సౌందర్య సాధనాలలో పెరుగును విదేశాలలో సైతం ఉపయోగిస్తున్నారు. ఇకపోతే శరీరానికి పెరుగు తినడం వల్ల ఎంత మేలు జరుగుతుందో ముఖానికి రాసుకుంటే నిగారింపు కూడా లభిస్తుంది. చర్మ సంరక్షణలో పెరుగు అనేది ఎప్పుడూ ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ముఖానికి ఉపయోగించడం వల్ల పాత చర్మ కణాలు తొలగిపోయి.. కొత్త చర్మ కణాలు ఆరోగ్యంగా పెరుగుతాయి.

మీరు కూడా చర్మానికి సంబంధించిన చిట్కాలు ఎదురు చూస్తూ ఉన్నట్లు అయితే కొన్ని అద్భుతమైన హోం రెమడీలు మీకు అందుబాటులో ఉన్నాయి. అద్భుతమైన ఫలితాలను మీరు పొందవచ్చు. వాటిలో పెరుగు చాలా ఉత్తమమైనది. పెరుగు , బియ్యం పిండి కలిపి స్క్రబ్ చేయవచ్చు . పెరుగును ముఖానికి అప్లై చేసి స్క్రబ్ చేసినట్లయితే జిడ్డు పోయి మృదువుగా మారుతుంది. పెరుగు , బియ్యం పిండి కలిపి ముఖంపైన అప్లైచేసి స్క్రబ్ లాగా చేయాలి. ఇలా చేయడం వల్ల జిడ్డు చర్మం కలిగిన వారికి మంచి ఫలితం లభించడమే కాకుండా చర్మంపై పేరుకుపోయిన మృత కణాలు కూడా తొలగిపోతాయి.

This tip means getting beautiful skin
This tip means getting beautiful skin

ఇక ఈ ఫేస్ ప్యాక్ ను ఎలా తయారు చేసుకోవాలి అంటే ఒక టేబుల్ స్పూన్ బియ్యం పిండి, ఒక టేబుల్ స్పూన్ పెరుగు వేసి బాగా కలపాలి . అందులో ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం కలపాలి. ఈ మూడింటిని బాగా కలిపి స్క్రబ్ చేసుకోవాలి. 20 నిమిషాల తర్వాత నీటితో శుభ్రం చేసుకుంటే సరిపోతుంది. పెరుగు , ఆలివ్ ఆయిల్, తేనెతో కూడా స్క్రబ్ తయారు చేసుకోవచ్చు. తేనెలో యాంటీబ్యాక్టీరియల్ , యాంటీ మైక్రో బయల్ లక్షణాలు ఉండటం వల్ల చర్మానికి సహజమైన లుక్ లభిస్తుంది.ఫలితంగా చర్మం తాజాగా అందంగా కనిపిస్తుంది.