Health Benefits : శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ తొలగించాలంటే..?

Health Benefits : మనం తీసుకునే కొన్ని ఆహార పదార్థాల కారణంగా చెడు కొలెస్ట్రాల్ పేరుకుపోయే అవకాశం ఉంటుంది. అలాంటప్పుడు కొన్ని అనారోగ్య సమస్యలు కూడా ఎదురవుతాయి. ముఖ్యంగా అధిక బరువు , శ్వాస సంబంధిత సమస్యలు కూడా వచ్చే అవకాశాలు ఎక్కువ. ఎప్పుడైతే శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పేరుకుపోతుందో అప్పుడు అధిక రక్తపోటు.. డయాబెటిస్.. గుండె పోటుకు కూడా దారి తీసే అవకాశం ఉంటుంది.. శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ ను తొలగించాలంటే ఏం చేయాలి అనే విషయం గురించి ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం..

పోషకాలు అధికంగా ఉండే డ్రైఫ్రూట్స్ తినడం వల్ల శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించ వచ్చు. రోజువారీ ఆహారంలో బాదంపప్పు, పిస్తా , వాల్ నట్స్ వంటి డ్రై ఫ్రూట్స్ చేర్చుకోవడం వల్ల మంచి కొలెస్ట్రాల్ ను పెంచడంలో ఇవి సహాయపడతాయి. ఇక కొలెస్ట్రాల్ ను నియంత్రించుకోవాలి అంటే మీరు ప్రతిరోజు వాల్నట్స్ తింటే సరిపోతుంది. వాల్ నట్స్ లో ఒమేగా త్రీ ఫ్యాటీ ఆసిడ్స్ తోపాటు సాచ్యురేటెడ్ కొవ్వులు ఉండడం వల్ల మంచి కొవ్వును పెంచి చెడు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తాయి. మీ రోజు వారి ఆహారంలో బాదం పప్పు చేర్చుకుంటే చాలా ఫిట్ గా ఉండవచ్చునని వైద్యులు సైతం సలహా ఇస్తున్నారు. బాదం పప్పు లో అమైనో యాసిడ్స్ ఉండటం వల్ల ఇవి శరీరంలో నైట్రిక్ ఆక్సైడ్ ను తయారు చేస్తాయి.

to remove the bad cholesterol accumulated in the body
to remove the bad cholesterol accumulated in the body

పిస్తా పప్పు తినడం వల్ల శరీరంలో మంచి కొలెస్ట్రాల్ పెరిగి చెడు కొలెస్ట్రాల్ దూరమవుతుంది. శరీరంలో పెరిగిన కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడానికి ఈ పిస్తాపప్పు చాలా బాగా పనిచేస్తుంది. అవిసె గింజలను కూడా రోజువారీ ఆహారంలో చేర్చుకోవడం వల్ల శరీరంలో పొట్ట చుట్టూ పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించడానికి చాలా బాగా పనిచేస్తాయి. వీటితో పాటు విత్తనాలు కూడా మీరు ఆహారంలో ఒక భాగంగా చేసుకోవచ్చు. కాబట్టి ప్రతి రోజూ ఒక గుప్పెడు పరిమాణంలో వీటన్నింటినీ కలిపి తీసుకుంటే శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ ఇట్టే దూరం అవుతుంది.