Health Benefits : శంకు పుష్పం ప్రయోజనాలు తెలిస్తే షాక్..!!

Health Benefits : సాధారణంగా రోడ్డుకు ఇరువైపులా నీలిరంగు లో శంకు వలె కనిపిస్తూ ఉండే శంకు పుష్పం గురించి తెలియని వారంటూ ఎవరూ ఉండరు. అయితే ఈ పువ్వును చాలామంది చూసినప్పటికీ దీని వల్ల కలిగే ప్రయోజనాలు మాత్రమే. ఈ మధ్యకాలంలో ఈ శంకు పుష్పాలను దేవుడి పూజ మందిరంలో కూడా ఉపయోగిస్తున్నారు . అందుకే ఇటీవల చాలామంది తమ ఇంటి ఆవరణలో పెంచుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఇకపోతే కేవలం అలంకరణ కోసం మాత్రమే కాదు ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలను కలిగిస్తుంది అని ఆయుర్వేద శాస్త్రం లో వర్ణించబడింది.

శంకు పుష్పం మనిషి యొక్క జ్ఞాపక శక్తిని పెంచడానికి సహాయపడుతుంది. అలాగే ఒత్తిడిని దూరం చేయడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది.. ఇందులో యాంజియోలైటిక్, మత్తుమందు, యాంటీ కన్వల్సెంట్ తోపాటు ప్రశాంతత కలిగించే వివిధ లక్షణాలను కలిగి ఉండడం గమనార్హం. శంకు పుష్పం యొక్క ఆకులు, పువ్వులను ఆయుర్వేద మందుల తయారీలో విరివిగా ఉపయోగిస్తారు. శంకు పుష్పం యొక్క ఆకులను బాగా ఎండబెట్టి పొడి చేసి ఆ మిశ్రమాన్ని మెదడుకు సంబంధించిన రోగాలను నయం చేయడంలో ఉపయోగించే మందుల తయారీలో ఎక్కువగా ఉపయోగిస్తారు.ఈ మొక్క లో ఉండే యాంటీ ఫంగల్, ప్రోటీన్లు, ఫైటో కెమికల్ పదార్థాల వల్ల గనేరియా, వ్యంధ్యత్వం వంటి లైంగిక రుగ్మతలను కూడా దూరం చేసుకోవచ్చు.

Health Benefits of cone flower
Health Benefits of cone flower

 

ఇకపోతే ఆచారాలు అలాగే పూజల కోసం కూడా ఎన్నో దేవాలయాల్లో ఈ పూలను వాడుతూ ఉంటారు. శంకు పుష్ప పూలను మరిగించి టీ చేసుకొని తాగడం వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి. ఈ మొక్క నుంచి ఈ పూలను కోసిన తర్వాత ఆ పూలని శుభ్రంగా కడిగి నీటిలో మరిగించి వడకట్టి తాగాలి. ఇక అవసరమైతే కొద్దిగా తేనె కూడా కలుపుకోవచ్చు. లైంగిక సమస్యలను కూడా దూరం చేయడంలో ఈ పువ్వు చాలా బాగా పనిచేస్తుంది. ఎన్నో రుగ్మతలను దూరం చేసే శంకు పుష్పం మొక్క ఎక్కడైనా లభిస్తే మీ ఇంటి ఆవరణలో పెంచుకోవడానికి ప్రయత్నం చేయండి.