Money : ఈ పథకంతో ఏకంగా రూ.16 లక్షలు ఆదాయం..ఎలా అంటే..?

Money : సాధారణంగా చాలామంది యుక్తవయసులో సంపాదించేటప్పుడే భవిష్యత్తు కోసం ప్రణాళికను సిద్ధం చేసుకోవాలి.. భవిష్యత్తు లో ఆర్థిక ఇబ్బందులు పడకుండా ఉండాలంటే ముందు నుంచి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన పథకాలలో డబ్బులు ఇన్వెష్ట్ చేసుకోవడం వల్ల దీర్ఘ కాలంలో ఎక్కువ డబ్బులను సొంతం చేసుకోవచ్చు. ఎవరైతే భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారో అలాంటివారికి వృద్ధాప్యంలో కూడా ఎటువంటి ఆర్థిక నష్టం కలగదు. అలాంటి వాళ్ళు పోస్ట్ ఆఫీస్ ప్రవేశపెట్టిన రికరింగ్ డిపాజిట్ ఖాతాలో మీరు కేవలం పది వేల రూపాయల చొప్పున పెట్టుబడి పెడితే చాలు ఏకంగా 16 లక్షల రూపాయలను సొంతం చేసుకోవచ్చు.

ప్రభుత్వ హామీతో పాటు వడ్డీ కూడా లభిస్తోంది . పైగా ఎలాంటి రిస్క్ ఉండదు కాబట్టి మీరు కూడా పోస్ట్ ఆఫీస్ పథకాలలో డబ్బులు ఇన్వెష్ట్ చేసుకోవచ్చు. ఇకపోతే పోస్ట్ ఆఫీస్ లో కాకుండా బ్యాంక్ లో అయితే ఫిక్స్డ్ డిపాజిట్ చేయాల్సి ఉంటుంది కాబట్టి మొత్తం డబ్బులు ఒకేసారి డిపాజిట్ చేయాలి. అయితే పోస్ట్ ఆఫీస్ ప్రవేశపెట్టిన రికరింగ్ డిపాజిట్ లో ప్రతి నెల డబ్బులు ఇన్వెష్ట్ చేయడం వల్ల వడ్డీని పొందే అవకాశం ఉంటుంది. మీ ఖాతాలో డబ్బు డిపాజిట్ చేస్తూ ఉన్నట్లయితే దాదాపుగా 5.8 శాతం వడ్డీ కూడా లభిస్తుంది.

Rs 16 lakh income together with this scheme
Rs 16 lakh income together with this scheme

ఇకపోతే మీరు వడ్డీ పొందాలి అంటే ప్రతి మూడు నెలలకొకసారి కాంపౌండింగ్ పద్ధతి ద్వారా మీ ఖాతాలో యాడ్ చేయడం జరుగుతుంది.మీరు ఈ ఖాతాలను తెరవాలని అంటే వంద రూపాయలు చెల్లించవచ్చు. ఇక గరిష్ఠంగా ఎంతైనా మీరు డిపాజిట్ చేసుకునే అవకాశం ఉంటుంది . 10 సంవత్సరాల పాటు పెట్టుబడి పెట్టాలి. పది సంవత్సరాలకు గాను ప్రతినెల 10,000 రూపాయలు ఇన్వెస్ట్ చేసినట్లయితే మొత్తం 12 లక్షల రూపాయలు వస్తాయి. అంతేకాదు 5.8 శాతం వడ్డీ రేటు తో కలుపుకొని రూ.16,26,476 పొందవచ్చు . ఇక మీరు ప్రతి నెల 10 వేల రూపాయలు డిపాజిట్ చేయలేకపోతే రూ.3,000 అయినా డిపాజిట్ చేస్తే పది సంవత్సరాలు పూర్తి అయ్యేసరికి రూ.5 లక్షలకు పైగా మీ చేతికి వస్తాయి.