Coconut Oil : కొబ్బరినూనె తో చర్మ సౌందర్యం మెరుగు పడాలంటే..?

Coconut Oil : కొబ్బరి నూనె అనేది వెంట్రుకల ఆరోగ్యానికే కాదు చర్మ సౌందర్యానికి కూడా ఉపయోగపడుతుంది. ఆరోగ్యంగా ఉండాలన్నా కూడా కేరళ లో ఎక్కువగా కొబ్బరి నూనెను వంటలలో ఉపయోగిస్తారు. ఈ వేసవి కాలంలో చర్మానికి మరింత నిగారింపు తీసుకు రావాలి అంటే కొబ్బరినూనెతో కొన్ని రకాల మాస్క్ లను ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు.. ఎవరైనా సరే జిడ్డు చర్మం కలిగి ఉంటే ఒక బౌల్ తీసుకొని అందులో..ఒక టేబుల్ స్పూన్ కొబ్బరి నూనె , ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం అలాగే ఒక టేబుల్ స్పూన్ పెరుగు వేసి బాగా మిక్స్ చేయాలి.

ఇక దీనిని ముఖం మీద అప్లై చేసి ఆరిన తర్వాత శుభ్రం చేసుకుంటే ముఖం చాలా అందంగా తయారవుతుంది.ఇక ముడతలు వచ్చిన తర్వాత ముఖంలో కాంతి తగ్గినట్లయితే పట్టు తప్పిపోయిన చర్మానికి అందాన్ని తీసుకురావచ్చు. ఇందుకోసం నాలుగు టేబుల్ స్పూన్లు అవకాడో గుజ్జు తీసుకొని, అందులో ఒక టేబుల్ స్పూన్ జాజికాయ పొడి, ఒక టేబుల్ స్పూన్ కొబ్బరి నూనె వేసి బాగా మిక్స్ చేయాలి. దీనిని ముఖానికి అప్లై చేసి 20 నిమిషాల తర్వాత శుభ్రం చేసుకుంటే ముడతలు తగ్గి చర్మం మృదువుగా తయారవుతుంది.

To improve skin beauty with coconut oil
To improve skin beauty with coconut oil

ఇకపోతే శరీరంలో అక్కడక్కడ చర్మం నల్లబడుతుంది. కొంతమందికి నల్లబడ్డమే కాదు మచ్చలు కూడా వస్తాయి. ఇలాంటి సమస్యలు ఉన్నవారు ఒక టేబుల్ స్పూన్ కొబ్బరి నూనె, ఒక టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా వేసుకొని ముఖానికి అప్లై చేసి పది నిమిషాల తర్వాత శుభ్రం చేసుకుంటే.. బ్లాక్ హెడ్స్ కూడా దూరం అవుతాయి.కాకపోతే మార్కెట్లో దొరికే కొబ్బరి నూనె కంటే గానుగ పట్టి తీసిన తాజా కొబ్బరి నూనె ఉపయోగించడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి. కొబ్బరి నూనె వల్ల మరెన్నో ప్రయోజనాలు మనకు చేకూరుతాయి కాబట్టి క్రమం తప్పకుండా ఈ చిట్కాలు పాటిస్తే చర్మ సమస్యలను దూరం చేసుకోవచ్చు.