Health Tips : శరీరం నుండి విషపదార్థాలను ఎలా తొలగించాలో తెలుసా..?

Health Tips : శరీరంలో విష పదార్థాలు బయటకు పోవాలంటే ఎక్కువగా నిమ్మరసం తీసుకోవాలని వైద్యులు తెలియజేస్తున్నారు. ఇక ఈ విష పదార్థాల వల్ల ఎన్నో ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. అందుకే ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటిలో నిమ్మరసం కలుపుకుని తాగడం వల్ల శరీరంలో పేరుకుపోయిన చెడు కొవ్వు బయటకు వెళ్ళిపోతుంది. చెడు కొవ్వు వల్ల శరీరంలో అనేక రకాల సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. అలాంటప్పుడు సాధ్యమైనంతవరకు టాక్సిన్స్ ను ఎప్పటికప్పుడు బయటకు తొలగించే ప్రయత్నం చేయాలి. శరీరాన్ని డీటాక్సిఫై చేసే శక్తి ఉల్లిపాయలకి ఉంది అని ఇటీవల జరిగిన ఒక అధ్యయనంలో వెల్లడి చేయడం జరిగింది.

కాబట్టి ప్రతి రోజు మధ్యాహ్నం భోజనం చేసే సమయంలో ఆహారంలో ఒక భాగంగా ఉల్లిపాయ చేర్చుకొని తినడం వలన శరీరంలో పేరుకుపోయిన ట్యాక్సిన్స్ బయటకు వెళ్ళిపోతాయి.ముఖ్యంగా బీట్ రూట్ లో విటమిన్స్, మినరల్స్ పుష్కలంగా ఉండటం వల్ల ఇది రక్తంలోని బాక్టీరియాను బయటికి పంపించడంలో సహాయపడుతుంది. సాధారణంగా మనం తీసుకొనే వైట్ రైస్ కంటే బ్రౌన్ రైస్ లో ఎక్కువ పోషకాలు వుంటాయి. బ్రౌన్ రైస్ తినడం వల్ల డయాబెటిస్ వారితో పాటు శరీరానికి చల్లదనాన్ని కూడా అందిస్తుంది. కాబట్టి వారానికి రెండు సార్లైనా సరే బ్రౌన్ రైస్ ను ఎక్కువగా తినాలి అని వైద్యులు సూచిస్తున్నారు.

Do you know how to remove toxins from the body
Do you know how to remove toxins from the body

ఇకపోతే మీరు తీసుకునే ఆహార పదార్థాలను సాధ్యమైనంత వరకు నూనె తక్కువగా ఉండేలా చూసుకోవాలి.ఇక ఆకుకూరలు కూడా ఆరోగ్యానికి ఎన్నో రకాలుగా ప్రయోజనాలను కలిగిస్తున్నాయి. శరీరంలో పేరుకుపోయిన టాక్సిన్లను బయటకు పంపించడానికి కూరగాయలు చాలా చక్కగా సహాయపడతాయి. అందుకే శరీరంలోని టాక్సిన్స్ ను తొలగించాలి అంటే ఇలాంటి ఆహారాలను తప్పకుండా తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ముఖ్యంగా గ్రీన్ టీ కూడా శరీరంలో పేరుకుపోయిన చెడు వ్యర్థాలను బయటకు పంపించడం లో సమర్థవంతంగా పనిచేస్తుంది. ఇక మీకు ఈ ఆర్టికల్ నచ్చినట్లయితే మీకు తెలిసిన వాళ్లకి వాట్స్అప్ ద్వారా షేర్ చేయవచ్చు.