Jhansi Lakshmi Bhai : చరిత్ర నిజాలు : ఝాన్సీ లక్ష్మీ బాయి జీవితం లో మనకి తెలియని కోణం !!

Jhansi Lakshmi Bhai : మణికర్ణిక :

Advertisement

వీర వనితగ ప్రసిద్ధి చెందిన ఝాన్సీ లక్ష్మీబాయి అసలు పేరు మణికర్ణిక. ఈమె నవంబరు 19 1828వ సంవత్సరము లో విక్రమ నామ సంవత్సరం బహుళ చతుర్దశి నాడు వారణాసిలో జన్మించింది. ఆమె తల్లి భాగీరథీబాయి,తండ్రి మోరోపంత్ తాంబే. వీరిది సాంప్రదాయ బ్రాహ్మణ కుటుంబం. ఆమె తల్లి చాలా తెలివైనది మరియు గొప్ప ఆధ్యాత్మిక శక్తి కలది. రాణి అసలు పేరు మణికర్ణిక అయినప్పటికీ ఆమె ను ముద్దుగా మను అని పిలుచుకునేవారు. ఆమె తల్లి మనుకి నాలుగేళ్లు నిండకుండానే మరణించింది. దాంతో ఆమె బాగోగులు చూసుకోవాలిసిన బాధ్యత తండ్రి తీసుకోవలసి వచ్చింది. కత్తిసాము చేయడం , గుర్రపుస్వారీ, తుపాకీ పేల్చడం వంటివి అంటే మనూకు చాలా ఇష్టం గా ఉండేది . ఖడ్గం చేతబట్టి , కళ్ళెం బిగించి గాలి విసురుకు ఉవ్వెత్తుగా ఎగిసి పడే కేశాలతో గుర్రపు స్వారీ చేస్తూ దూసుకుపోయేది.

Advertisement

Jhansi Lakshmi Bhai : వివాహం ,సంతానం

1842 లో ఝాన్సీ పట్టణానికి రాజైన గంగాధరరావు నెవల్కార్ తో మను కి వివాహం జరిగేనాటికి ఆమెకి 13 సంవత్సరాలు.దాంతో ఒక పేద బ్రాహ్మణ బాలిక ఝాన్సీ రాణి లక్ష్మీబాయిగా మారిపోయింది. ఝాన్సీ ఉత్తరప్రదేశ్లో ఒక జిల్లా కేంద్ర పట్టణం. ఈ వివాహం తో ఆమె ఝాన్సీ పట్టణానికి మహారాణి కావడం అనేది జరిగింది. అప్పుడున్న ఆచారాల ప్రకారం మహారాణి అయిన తర్వాత ఆమె పేరు లక్ష్మీబాయి గా మారింది. 1851లో లక్ష్మీబాయి మగ బిడ్డ ను ప్రసవించింది. కానీ ఆ పిల్లవాడు నాలుగు నెలల వయసులో మరణించడం జరిగింది. 1853 లో లక్ష్మీబాయి భర్త అయిన గంగాధర రావుకు తీవ్ర అస్వస్థత కారణంగా వేరే బిడ్డను దత్తత తీసుకోవాల్సిందిగా అందరూ సలహా ఇచ్చారు. ఆ సూచన మేరకు గంగాధర రావు దూరపు బంధువైన వాసుదేవ నేవల్కర్ కొడుకైన దామోదర్ రావు అనే పిల్లవాడిని ఆయనమరణించడానికి కేవలం ఒక్క రోజు ముందు దత్తత తీసుకోవడం అనేది జరిగింది. నవంబర్ 21వ తేదీ 1853 న గంగాధరరావు మరణించారు. ఆ పరిస్థితుల్లో రాజ్యపు బాధ్యత లక్ష్మీబాయి పై పడింది.

లక్ష్మీబాయి ప్రతిజ్ఞ:

గంగాధరరావు,లక్ష్మీబాయి దంపతులు దత్తత తీసుకునే సమయానికి భారత గవర్నర్ జనరల్ గా డల్హౌసీ ఉన్నాడు. హిందూ సాంప్రదాయం ప్రకారం ఝాన్సీ పట్టణానికి దామోదర్ రావు వారసుడు కావల్సి ఉన్నా బ్రిటీష్ ప్రభుత్వం దామోదర్ రావు గంగాధరరావు కి రక్త సంబంధం కానందువల్ల, దత్త తీసుకోవడం వలన , లార్డ్ డెల్ హౌసి, సిద్ధాంతం ప్రకారం దామోదర్ రావు సింహాసనాన్ని పొందే అధికారం లేదని నిరాకరించారు . అప్పుడు లక్ష్మీ బాయి ఈస్ట్ ఇండియా కంపెనీ కి చెందిన ఒక లాయర్ అయిన రాబర్ట్ ఎల్లిస్ తో సంప్రదింపులు జరిపి లండన్ కోర్టులో దావా వేయడం జరిగింది. ఆ లాయర్ కేసును బాగా వాదించినా ప్రయోజనం లేకపోయింది. ఆ కేసును కోర్టు కొట్టివేసింది. అప్పటినుండి ఆంగ్లేయులకు రాణి లక్ష్మీ బాయి మీద కక్ష పెంచుకుని వారి రాజాభరణాలు స్వాధీనం పరచుకోవడం తో పాటు.. మార్చి 1854 లో రాజు ఋణ పడి ఉన్న 60 వేల రూపాయలు ఆమెకు లభించే పెన్షన్ నుంచి తీసుకోవడం తో పాటు ఆమె తక్షణం ఝాన్సీ పట్టణాన్ని విడిచి వెళ్లిపోవాల్సిందిగా ఆదేశించారు. కానీ రాణి మాత్రం అందుకు ఒప్పుకోక పోగా.. తాను ఝాన్సీ పట్టణాన్ని విడిచి ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళేది లేదని ప్రతిజ్ఞ చేసింది.

స్త్రీ లకు సైతం యుద్ధ శిక్షణ :

రాణి లక్ష్మీ బాబాయ్ ఝాన్సీ ని బ్రిటిష్ వారికీ దక్కకూడదు అని సంకల్పించుకుని… ఆమె తన సైన్యాన్ని బలపరచుకోవడం తో పాటు తమకు తాముగా ముందుకు వచ్చిన వాళ్ళ కు శిక్షణ ఇచ్చి ఒక సేన గా తయారుచేసింది. స్త్రీ లకు సైతం యుద్ధ శిక్షణ ఇవ్వడం జరిగింది. యుద్ధ వీరులైన గులాం గౌస్ ఖాన్ , దివాన్ రఘునాథ్ లాల భు బక్షి,దోస్త్ ఖాన్, ఖుదాబక్ష్,, మోతీ బాయ్ , సుందర్-ముందర్ , ఖాసిం బాయి, సింగ్, మరియు దీవాన్ జవహర్ సింగ్ వంటి వారు రాణి లక్ష్మీ బాయ్ బలగంలో ఉన్నారు.ఝాన్సీ లో ఈ విధమైన పరిస్థితులు ఉండగానే , 10,మే1857లో మీరట్ లో భారత సిపాయిల తిరుగుబాటు మొదలైంది. బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ఇది మొదటి తిరుగుబాటు గా నిలిచింది అని చెప్పవచ్చు. పందులంటే ముస్లిమ్స్ కి ద్వేషం, హిందువులకు ఆవు లు పవిత్రమైనవి అని తెలిసి కూడా, వాళ్ళు యుద్ధంలో తుపాకీ గుండు తగలకుండా వేసుకునే కవచాలకు మరియు వాళ్ళు వాడే తుపాకీలకు పందుల మరియు ఆవుల కొవ్వుని పూసి బ్రిటిష్ అధికారులు వాటిని వాడవల్సిందిగా బలవంత పరిచి,ఎవరైతే వినలేదో ఎదురు తిరిగారో వారికి శిక్షలు వేయడం మొదలుపెట్టారు. ఆ తిరుగుబాటు జరిగే సమయంలో చాలా మంది బ్రిటిష్ ప్రజలు, మహిళలు,పిల్లలు సిపాయిల చేతిలో అంతమొందించబడ్డారు. ఆ సమయం లో బ్రిటిష్ వాళ్ళు ఈ తిరుగుబాటును త్వరగా అణిచివేయాలని నిర్ణయంచుకుంటారు.

లక్ష్మి బాయి తెగువ:

మే 1857,లో భారత దేశంలో కలవరం ప్రాకడం ప్రారంభం కాబడింది. ఉత్తర ఖండంలో మొదటి భారత స్వాతంత్ర్య యుద్ధం మొదలైన ఈ క్లిష్ట పరిస్థితులలో,బ్రిటిష్ వాళ్ళు వాళ్ళ దృష్టిని వేరే ప్రాంతంలో పెట్టవలసిందిగా ఆదేశాలు రావడంతో, ఝాన్సీ ని ,లక్ష్మీబాయి, గురించి పెద్దగా పట్టించుకోలేదు.ఆ సమయం లో ఝాన్సీ, ఝాన్సీ రాణి ఆధీనంలో నే ఉండటం జరిగింది. ఆ సమయాన్ని తనకు అనుకూలంగా మార్చుకుని, తన చాతుర్యంతో ఝాన్సీ రాణి యుద్ధానికి కావలసిన సేవలను సమర్ధవంతంగా తయారు చేసుకుంది.
ఆమె యుద్ధ వీరులతో కలిసి బ్రిటిష్ వారికీ లొంగ కూడదని నిర్ణయించుకొంది. యుద్ధ సమయం లో ఝాన్సీ మహిళా సైన్యం కూడా యుద్ధ సామగ్రిని మరియు ఆహారాన్ని సిపాయిలకు అందించేవారు .

బిడ్డను వీపున కట్టుకుని:

ఆమె తన బలగాలతో బ్రిటిష్ కి వ్యతిరేకంగా చాలా భయంకరంగా యుద్ధం చేసింది. ఝాన్సీ కి స్వేచ్చ కలిగించడం తో పాటు లక్ష్మిబాయి ని స్వతంత్రుపరురాలు గా చేయడం కోసం తిరుగుబాటు దార్ల నాయకుడైన తాత్యా తోపే ఆధ్వర్యములో 20,000 మంది సైన్యం పంపబడింది ఆమెకి సహాయం గా పంపబడింది. మార్చి 31 లో బ్రిటిష్ వాళ్ళ దగ్గర 1,540 సిపాయిలు మాత్రమే ఉన్నాకాని , ఏ శిక్షణ లేని వాళ్ళ కంటే వాళ్ళు చాలా శిక్షణ పొందినవారు, మరియు క్రమశిక్షణ కలిగిన వారు కావడంతో ,బ్రిటిష్ వాళ్ళు ఆక్రమణ మొదలు పెట్టింది. ఈ అనుభవం లేని సిపాయిలు పారిపోయారు. దీంతో లక్ష్మీబాయి బలగాలు బలహీనమవడంతో మూడు రోజుల తర్వాత బ్రిటిష్ వాళ్ళు నగర గోడలు బద్దలు కొట్టుకుని నగరాన్ని ఆక్రమించారు. అప్పుడు లక్ష్మి బాయి పురుష అవతారం లో, తన బిడ్డను వీపున కట్టుకుని వారి కంటపడకుండా పారిపోయింది. కల్పి అనే ప్రదేశానికి చేరుకుని తాంతియా తోపే అనే విప్లవకారుణ్ణి కలుసుకుంది.

రాణి ఆఖరి కోరిక :

లక్ష్మిబాయి చిన్నవాడు అయిన తన కొడుకు దామోదర్ రావు, తన బలగాలతో కలిసి కల్పి కి పారిపోయి తాంతియా తోపే ఉండే తిరుగుబాటు దారులతో చేరింది లక్ష్మీబాయి తాంతియా తోపే గ్వాలియర్ కు వెళ్లి తమ తిరుగుబాటు బలగాలను ఒక్కటిగా చేసి గ్వాలియర్ మహారాజ సైన్యాన్ని ఓడించి తమ బలగాలతో వాళ్ళను పూర్తిగా నశించి పోయేలా చేయడం తో పాటు వాళ్ళు కపటోపాయము తో గ్వాలియర్ కోటను ఆక్రమించుకున్నారు. కానీ,1858 జూన్ 17,లో రెండో రోజు జరిగిన యుద్ధంలో రాణి మరణించింది. ఆమె మరణానికి కారణమైన పరిస్థితుల మీద చాలా వాదనలున్నాయి. అయితే ఆమె మరణానికి ముందు జరిగిన ఒక సంఘటన తప్పక తెలుసుకోవాల్సి ఉంది.. ఆమె మరణానికి ముందు అక్కడ ఉన్నవారి తో ఈ విధం గా చెప్పింది. ఒకవేళ నేను మరణిస్తే నా కుమారుడు ఆనంద రావు జీవితాన్ని నా జీవితం కంటే విలువైనది గా పరిగణించి అతనిని జాగ్రత్తగా పెంచి పెద్ద చేయాలి.” నేను మరణించిన తర్వాత నా శవం విధర్మీయుల చేతుల్లో పడకూడదు అని కూడా ఆమె కోరింది.

వీర పోరాటం:

బ్రిటిష్ వారి వద్ద సైనిక శక్తిఎక్కువగా ఉండడం వలన మన దేశ విప్లవకారుల సైన్యం వారి ముందు నశించిపోయింది. ఆ సమయం లో రాణికి తప్పించుకుని పోవడం తప్ప మరొక మార్గం లేదు. ఆ సమయంలో ఆమె ముందుకు దూకింది. ఆంగ్లేయుల సైన్యం ఆమెను చుట్టుముట్టింది. అప్పటికే ఆమె నుండి రక్తపుటేరులు ప్రవహిస్తున్నాయి.రాణి చెయ్యి ఒకటి తెగిపడింది. పొట్టలోనుంచి నుంచి రక్తం కారుతోంది. ఒళ్లంతా గాయాల తో నిండి ఉంది.ఆమెకు కళ్ళు బైర్లు కమ్ముతున్నాయి. ఆమె దురవస్థ ని చూసి ఆమె అంగ రక్షకుడు కుల్ మొహమ్మద్ తట్టుకోలేకపోయాడు. రాణిని భుజానికి ఎత్తుకుని గంగాదాసు ఆశ్రమం వైపు పరుగు తీశారు.

రాణి మరణం :

ఆ రోజు 28,జూన్ 1858 చుట్టూ దట్టమైన చీకటి. ఆ చీకట్లో బాబా గంగా దాస్ రక్తసిక్తమైన రాణి ముఖాన్ని గుర్తు గుర్తు పట్టలేకపోయాడు. చల్లని నీటితో ఆమె ముఖాన్ని శుభ్రపరచి గంగా జలం తాగించాడు. అప్పుడూ రాణికి కొద్దిగా స్పృహ వచ్చింది. వణుకుతున్న కంఠంతో ఒక్క సారి “హర హర మహాదేవ” అని మాత్రం చెప్పగలిగింది. ఆ తర్వాత ఆమె స్పృహ తప్పింది. మరల కొద్ది సేపటి తర్వాత అతి కష్టం మీద ఆమె కన్నులు తెరిచి బాల్యంలో తాను నేర్చుకున్న భగవద్గీత శ్లోకాలు నెమ్మదిగా ఉచ్ఛరించడం మొదలు పెట్టింది. ఆమె కంఠస్వరం అంతకంతకూ క్షిణించి ఓ కృష్ణా నీ ముందు నేను ప్రణమిల్లు చున్నాను అని అంది. ఇక ఆమె చివరి మాటలు. ఝాన్సీ రాజ్యపు భాగ్య రేఖ అంతరించింది.ఆమెకున్న ధైర్యము, వివేకము,పరాక్రమము, ముందుచూపు , మరియు ఆమె చేసిన త్యాగాలు ఆమెను స్వాతంత్ర్య పోరాటంలో ఒక ప్రసిద్ధ వ్యక్తి గా గుర్తింపు తెచ్చిపెట్టాయి. ఝాన్సీ మరియు గ్వాలియర్ లో ఆమె గుర్తుగా కంచు విగ్రహాన్ని స్థాపించారు, ఆ రెండు చోట్లా ఆమె గుర్రం పైన కూర్చున్నట్టుగా మలచబడి ఉంటుంది. ఆ విధం గా మణికర్ణిక ఝాన్సీ లక్ష్మి బాయి గా పేరుపొంది ,బ్రిటిష్ వారితో తిరుగులేని పోరాటం చేసి చరిత్రలో నిలిచి పోయినది.

Advertisement