Health Benefits : వేసవికాలంలో ఈ జ్యూస్ తో రోగాలన్నీ పరార్..!

Health Benefits : వేసవికాలంలో సూర్యుడి తాపం నుంచి మనం తప్పించుకోవాలంటే కొన్ని రకాల తాజా పండ్ల రసాలను తీసుకోవాలి . లేకపోతే వేసవి కాలంలో లభించే తాజా పండ్లతో తయారు చేసిన జ్యూస్ ల కంటే.. పైనాపిల్ రసం మెరుగ్గా మీ ఆరోగ్యాన్ని కాపాడుతుంది అని చెప్పవచ్చు. ముఖ్యంగా ఎండాకాలంలో పైనాపిల్ నుంచి తీసిన రసం తాగడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి అనే విషయం గురించి ఇప్పుడు ఒకసారి చదివి తెలుసుకుందాం..ముఖ్యంగా పైనాపిల్ రసం లో విటమిన్ సి తో పాటు యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా లభించడం వల్ల గుండె సంబంధిత వ్యాధులు కూడా దూరం అవుతాయి. ముఖ్యంగా ఇందులో ఉండే విటమిన్ సి వల్ల జుట్టు, చర్మ సంబంధిత సమస్యలు దూరం అవుతాయి.

అంతేకాదు యాంటీఆక్సిడెంట్ కారణంగా రోగ నిరోధక శక్తి పెరిగి సీజనల్ వ్యాధులను దూరం చేసుకోవచ్చు. అందుకే ప్రతిరోజు మధ్యాహ్నం పూట ఒక గ్లాస్ పైనాపిల్ రసం తాగాలని వైద్యులు సూచిస్తున్నారు.కొంతమందిలో ఎండాకాలం వచ్చిందంటే కడుపు సంబంధిత సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి వారు రోజు పైనాపిల్ రసం తాగడం వల్ల పైనాపిల్ లో ఉండే ఫైబర్.. పేగులను ఆరోగ్యంగా ఉంచడమే కాకుండా జీర్ణ వ్యవస్థను బలోపేతం చేస్తుంది. అంతే కాదు కడుపు సంబంధిత సమస్యలను దూరం చేయడంలో ఈ జ్యూస్ సమర్థవంతంగా పనిచేస్తుంది.

This juice will cure all diseases in summer
This juice will cure all diseases in summer

ముఖ్యంగా కొంత మందికి వేడి వల్ల జలుబు చేసే అవకాశం ఉంటుంది. అలాంటి వారు పైనాపిల్ రసం తాగడం వల్ల రోగనిరోధక శక్తి పెరిగి జలుబు, దగ్గు , ఫ్లూ వంటి సమస్యలను దూరం చేసుకోవచ్చుఅధిక బరువుతో బాధపడుతున్న వారు వేసవికాలం బరువు తగ్గడానికి ఉత్తమమైన సీజన్ అని చెప్పవచ్చు. యోగ, ఎక్సర్సైజ్, వ్యాయామం వంటి వాటితో పాటు ఆహారం విషయంలో కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం. ఉదయం అల్పాహారం తర్వాత రెండు గంటలు ఆగి పైనాపిల్ రసం తాగితే బరువు తగ్గే అవకాశాలు ఉంటాయి. ఇక ఇందులో ఉండే మాంగనీసు, కాల్షియం కారణంగా ఎముకలు దృఢంగా, పటిష్టంగా తయారవుతాయి.