God : దేవుడికి నైవేద్యంగా ఈ పదార్థాలు పెడితే దోషమా..?

God : దేవుడికి పూజ చేసేటప్పుడు అత్యంత భక్తి శ్రద్ధలతో పూజ చేయడంతోపాటు ప్రత్యేకంగా తయారు చేసిన ప్రసాదాలను కూడా వడ్డిస్తూ ఉంటారు. అనాది కాలం నుండి దేవాలయాలకు వెళ్లి నైవేద్యాలు సమర్పించడం అలాగే అక్కడ ఇచ్చే తీర్థప్రసాదాలు స్వీకరించడం వంటివి చేస్తూనే ఉన్నాం. ఇక అంతే కాదు ఇంట్లో పూజ చేసేటప్పుడు ప్రతి రోజూ లేదా ప్రత్యేకమైన పండుగలు, శుభకార్యాల సమయాల్లో దేవుడికి నైవేద్యం సమర్పిస్తూ ఉంటారు. పూజా కార్యక్రమాలను సవ్యంగా నిర్వహించి.. ఏ లోటు ఉండకూడదన్న కారణంతోనే దేవుడికి నైవేద్యాలు సమర్పిస్తారు.

నైవేద్యం దేవుడికి సమర్పించి భక్తిశ్రద్ధలతో పూజ చేయడంవల్ల కోరికలు నెరవేరుతాయని భక్తుల ప్రగాఢ నమ్మకం. చాలా వరకు ప్రతి ఒకరు తీపి పదార్థాలను నైవేద్యంగా పెడతారు. ప్రత్యేకంగా నైవేద్యం తయారు చేయలేని సమయాలలో చాలామంది చక్కెరను నైవేద్యంగా సమర్పిస్తారు. చాలావరకు కొంతమంది చెబుతున్న విషయం ఏమిటంటే దేవుడికి చక్కెరను నైవేద్యంగా పెట్టడం అనేది మహాపాపమని చెబుతూ ఉంటారు. అయితే ఇదంతా కేవలం ఒక అపోహ మాత్రమే అని.. దేవుడికి చక్కెరను నైవేద్యంగా పెట్టడం వల్ల దేవుడి అనుగ్రహం మీపై ఉండి అన్నిరకాల అనుకూలతలను కలుగజేస్తారని పండితుల అభిప్రాయం.కేవలం దేవుడికి కొన్ని పదార్థాలను మాత్రమే నైవేద్యంగా సమర్పించాలి

Is it wrong to put these materials as an offering to God
Is it wrong to put these materials as an offering to God

అన్న పద్ధతులు ఎక్కడా చెప్పబడలేదు.దేవుడికి నివేదనగా మనం ఏ ఆహారపదార్థాలు అయితే చేసుకుంటామో వాటిని నైవేద్యంగా సమర్పించవచ్చు. ఇవే కాకుండా మనకు తినాలనిపించిన రుచులను కూడా దేవునికి నైవేద్యంగా సమర్పించి మన కోరికలను తెలియజేయవచ్చు. కాబట్టి చక్కెరను నైవేద్యంగా సమర్పించడం వల్ల ఎటువంటి దోషం ఉండదని,మనం చేసినటువంటి ఆహారపదార్థాలను దేవుడికి నైవేద్యంగా సమర్పించిన తర్వాత మనం తీసుకోవడం వల్ల అది ప్రసాదం అవుతుంది. కాబట్టి చక్కెర దేవుడికి నివేదనగా సమర్పించడంలో ఎటువంటి సందేహపడాల్సిన అవసరం లేదని పండితులు తెలియజేస్తున్నారు. కాబట్టి ఇకపై మీరు కూడా దేవుడికి నైవేద్యంగా చక్కెరను ప్రసాదిస్తుంటే ఏమాత్రం ఇబ్బంది పడకుండా చక్కెరను నైవేద్యంగా పెట్టవచ్చు . అందులో ఏ మాత్రం మీరు అపోహ చెందాల్సిన అవసరం లేదు.