Beauty Tips : పిగ్మెంటేషన్ తో బాధపడుతున్నారా..?

Beauty Tips : పిగ్మెంటేషన్ అంటే ముఖంపై నల్లటి మచ్చలు.. చర్మం కాంతి కోల్పోవడం.. దానికి భిన్నంగా కనిపించినప్పుడు ఇలాంటి ట్యాన్ ను తొలగించుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు మగువలు. వీటన్నింటినీ దూరం చేసుకోవాలి అంటే క్యారెట్ రసం చక్కటి పరిష్కారం అని చెప్పవచ్చు. ముఖ చర్మాన్ని కాంతివంతంగా ఉంచడమే కాకుండా అటు ఆరోగ్యానికి, దంతాలకు కూడా చక్కటి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది.ఇక ఎలాంటి చిట్కాలు ఉపయోగించి చర్మ సమస్యలను ఎలా దూరం చేసుకోవచ్చో ఇప్పుడు ఒకసారి చదివి తెలుసుకుందాం..

Beauty Tips Suffering from pigmentation
Beauty Tips Suffering from pigmentation

మచ్చలను మరకలను తొలగించడం.. : అసలే వేసవి కాలం.. బయటకు వెళితే చాలు ముఖం పై ట్యాన్ ఇట్టే వచ్చేస్తుంది. ఇందుకోసం బొప్పాయి , క్యారెట్ ఫేస్ ప్యాక్ చాలా బాగా పని చేస్తుందని చెప్పవచ్చు. ఒక టేబుల్ స్పూన్ క్యారెట్ పేస్ట్.. మరొక టేబుల్ స్పూన్ బొప్పాయి పేస్ట్ అలాగే ఒక టేబుల్ స్పూన్ పాలు వేసి బాగా మిక్స్ చేయాలి. ఒక క్రీమ్ లాగా చేసుకొని ముఖానికి అప్లై చేసి 20 నిమిషాల తర్వాత చల్లని నీటితో శుభ్రం చేస్తే సరిపోతుంది. ఇక వారానికి మూడు సార్లు కనుక ఈ ఫేస్ ప్యాక్ అప్లై చేసినట్లయితే మంచి ఫలితాలు లభిస్తాయి.

ముడతలను దూరం చేయడం కోసం : ముఖ్యంగా క్యారెట్లో విటమిన్ సి కూడా లభిస్తుంది ఇది యాంటీ ఏజింగ్ లక్షణంగా మనకు పనిచేస్తుంది. ఇక క్యారెట్లో ఉండే విటమిన్ ఏ అలాగే విటమిన్-సి రెండూ కూడా కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచడానికి సహాయపడతాయి. ముఖ్యంగా క్యారెట్ ను ప్రతి రోజూ తినడం లేదా క్యారెట్ తో ఫేస్ ప్యాక్ వేసుకోవడం లాంటివి చేయడం వల్ల చర్మం మీద ముడతలు దూరమవుతాయి. అంతేకాదు చర్మం బిగుతుగా మారడంతో పాటు నిత్యయవ్వనంగా కనిపిస్తుంది.

చర్మం ఎక్స్‌ఫోలియేషన్ కోసం .. క్యారెట్ మాస్క్‌ను తయారు చేయవచ్చు. మీకు క్యారెట్ పేస్ట్ 1 టేబుల్ స్పూన్, 1 టేబుల్ స్పూన్ పెరుగు, 1 టేబుల్ స్పూన్ శనగ పిండి, చిటికెడు పసుపు పొడి అవసరం. ఒక గిన్నెలోకి క్యారెట్ పేస్ట్ తీసుకోండి. పెరుగు, శనగపిండి మరియు పసుపు పొడి జోడించండి. ఈ ఫేస్ ప్యాక్‌ని ముఖం, మెడ మరియు చేతులకు అప్లై చేయండి. 15 నుండి 20 నిమిషాలు ఆరనివ్వండి, ఆపై శుభ్రమైన నీటితో శుభ్రం చేసుకోండి. ఈ ప్యాక్ మృత చర్మ కణాలను తొలగిస్తుంది.