Jobs : అస్సాం రైఫిల్ రక్షణ శాఖలో ఉద్యోగాలు..!!

Jobs : కేంద్ర ప్రభుత్వం వరుసగా ఉద్యోగ నోటిఫికేషన్లను విడుదల చేస్తూ నిరుద్యోగులకు శుభవార్త తెలుపుతూనే ఉంది. ఇప్పుడు తాజాగా మరొకసారి భారత ప్రభుత్వ హోం మంత్రిత్వ శాఖకు చెందిన.. షిల్లాంగ్ లోని అస్సాం రైఫిల్ డైరెక్టర్ జనరల్ కార్యాలయంలో స్పోర్ట్స్ పర్సన్స్ రిక్రూట్మెంట్ ర్యాలీ ద్వారా స్పోర్ట్స్ కోటాలో ని ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు తెలుస్తోంది . అందుకు సంబంధించి పూర్తి వివరాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం.

Advertisement
Jobs in Assam Rifle Defense Department
Jobs in Assam Rifle Defense Department

1).పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య 104 .. ఇందులో రైఫిల్ మ్యాన్/రైఫిల్ ఉమెన్ పోస్టులు కలవు.

Advertisement

2). ఖాళీల వివరాల : ఇందులో ఫుట్ బాల్ -20, ఆర్చెరీ-15, బాక్సింగ్-21, రోయింగ్-18, క్రాస్ కంట్రీ-10, పోలో-10, అథ్లెంటిక్ – 10 పోస్టులు కలవు.

3). వయస్సు : అభ్యర్థుల వయసు 18 నుంచి 23 సంవత్సరాల మధ్య ఉండాలి.

4). జీతభత్యాలు : ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.25, 000 నుంచి రూ.42,000 రూపాయల వరకు జీతం చెల్లిస్తారు.

5). అర్హతలు : అభ్యర్థులు పదవ తరగతి /తత్సమాన కోర్సు ఉత్తీర్ణత అయి ఉండాలి. అలాగే జాతీయ స్థాయి లేదా అంతర్జాతీయ క్రీడా పోటీలలో.. నేషనల్ స్పోర్ట్స్ లో పాల్గొని ఉండాలి.

6). ఎంపిక విధానం ; అభ్యర్థులకు ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, అచీవ్మెంట్స్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేయడం జరుగుతుంది.

7). దరఖాస్తు విధాన : ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ ద్వారానే అప్లై చేసుకోవాలి. దరఖాస్తుకు చివరి తేదీ ఏప్రిల్ 30.

8). దరఖాస్తు ఫీజు : జనరల్ అభ్యర్థులకు రూ.100 ,sc/st/ఇతర అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది.అభ్యర్థులు ఏదైనా పూర్తి సమాచారం కోసం అధికారిక వెబ్ సైట్ ను https://www.assamrifles.gov.in/ సంప్రదించడం మేలు. అభ్యర్థులు కచ్చితంగా స్పోర్ట్స్ కోటా సర్టిఫికెట్ ను కలిగి ఉన్న అభ్యర్థులు మాత్రమే ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. ఇందులో మహిళలు కూడా పోస్ట్ లు కలవు.

Advertisement