Health Benefits : వ్యాధులను దూరం చేసే తిప్పతీగ.. ప్రయోజనాలు తెలిస్తే షాక్..!!

Health Benefits : సాధారణంగా తిప్పతీగ మొక్క ను ఇప్పటి వరకు చాలా మంది ఒక పిచ్చి మొక్క గానే పరిగణించేవారు. ఇక కరోనా ఎప్పుడైతే వచ్చిందో.. అప్పటి నుంచి దీని విలువ తెలిసి దీనికి బాగా పాపులారిటీ కూడా వచ్చింది. కరోనా నుంచి మనం కోలుకోవాలి అంటే మన శరీరానికి రోగ నిరోధక శక్తి ఎంతో అవసరం. అలాంటి రోగనిరోధక శక్తిని అందించే యాంటీఆక్సిడెంట్లు తిప్పతీగ లో పుష్కలంగా లభిస్తాయి. కేవలం రోగనిరోధక శక్తిని పెంపొందించడమే కాదు ఎన్నో రకాల వ్యాధులను నయం చేయడంలో కూడా తిప్పతీగ ముందు ఉంటుంది అనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఇక తిప్పతీగ వల్ల ఎలాంటి రోగాలు నయం చేసుకోవచ్చో ఇప్పుడు ఒకసారి చదివి తెలుసుకుందాం..

తిప్పతీగ యొక్క ఆకులు, కాయలు, పూలు , కాండం,  వేర్లు ఇలా అన్నీ కూడా ఔషధ విలువలు మెండుగా కలిగి ఉన్నాయి. ఆయుర్వేద శాస్త్రం ప్రకారం తిప్పతీగ యొక్క ఆకులను నీటిలో వేసి మరగబెట్టి తాగితే వాత, పిత్త, కఫం లాంటి సమస్యలను దూరం చేసుకోవచ్చు. కరోనా తో పాటు పలు రకాల జ్వరాలు , ఒంటి నొప్పులు, రక్తశుద్ధికి కూడా ఉపయోగకరంగా ఉంటుంది అని చెబుతున్నారు. ముఖ్యంగా వీటిని ఎండబెట్టి పొడి చేసి నీటిలో కలుపుకుని తాగినా కూడా  ఔషధంగా పనిచేస్తుంది అని నిపుణులు చెబుతున్నారు.తిప్పతీగ లో ఉండే ఫ్లేవనాయిడ్స్,  పాలీఫెనాల్స్ .. ఫ్రీ రాడికల్స్ స్కావెంజింగ్ కార్యకలాపాలకు కారణమవుతాయి.

Thippatheega to Health benefits
Thippatheega to Health benefits

దీర్ఘకాలిక వ్యాధులను నివారించడానికి  తిప్పతీగ చాలా బాగా సహాయపడుతుంది. అంతే కాదు స్కిన్ క్యాన్సర్ తో పోరాడే వారికి కూడా తిప్పతీగ ఆకులు చాలా చక్కగా పనిచేస్తాయి అని చెప్పవచ్చు . ముఖ్యంగా చర్మంపై వచ్చే అన్ని సమస్యల్ని కూడా తిప్పతీగ ఆకులతో మనం దూరం చేసుకోవచ్చు. ఎముకల వ్యాధులను దూరం చేయడానికి.. డయాబెటిస్ ను  నియంత్రించడానికి కూడా తిప్పతీగ చాలా బాగా పనిచేస్తుంది. ఎక్కడపడితే అక్కడ పచ్చిక బయళ్ళలో తీగలాగా అల్లుకుపోయే..ఈ  తిప్పతీగ  రూపాయి ఖర్చు లేకుండా వైద్యం చేసుకోవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరికి ఉపయోగపడాలి అంటే  ఈ ఆర్టికల్ను వాట్సప్ ద్వారా ప్రతి ఒక్కరికి షేర్ చేయండి.ల‌